తూఛ్.. జగన్ యథాలాపంగా అన్నారు.. అంతే... : సజ్జల రామకృష్ణారెడ్డి
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం రివర్ బేసిన్‌లో సాగుతుందంటూ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై పెను దుమారమే చెలరేగింది. జగన్ వ్యాఖ్యలపై కూటమి నేతలు, మంత్రులు, ముఖ్యమంత్రి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ వ్యాఖ్యలపై వైకాపా నేతలు ఎలా స్పందించాలో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ఆ పార్టీ సీనియర్ నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి రంగంలోకి దిగారు.
తూఛ్.. జగన్.. ఏదో యథాలాపంగా అలా అన్నారు అంటూ కవరింగ్ చేసే ప్రయత్నం చేశారు. జగన్ ఏదో యథాలాపంగా అమరావతిని రివర్ బేసిన్‌లో కడుతున్నారు అన్నారని, దాన్ని పట్టుకుని టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారన్నారు.
జగన్ ఇల్లున్న ప్రాంతం, ప్రభుత్వ రాజధాని నిర్మాణాలు చేస్తున్న ప్రాంతం ఒకటేనా ఒక్కడ 10 అడుగుల లోతులోకెళితో నీళ్లు వస్తున్నాయి. పది సెంటీమీటర్ల వర్షం కురిస్తే సరస్సులు ఏర్పడుతున్నాయి. ఈ వర్షపు నీటిని ఎత్తిపోసేందుకే రూ.4 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు అని పేర్కొన్నారు.
తెలంగాణాలో శాఖాధిపతుల కార్యాలయాలతో సహా కలిపి సచివాలయాన్ని 10 లక్షల చదరపుటడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తే అమరావతిలో మాత్రం సచివాలయానికి 50 లక్షల చదరపు అడుగుల నిర్మాణాలు ఎందుకు అని సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రశ్నించారు.