సంబంధిత వార్తలు
- Samantha: సమంత నటించిన మా ఇంటి బంగారం ఆడియో హక్కులు పొందిన థింక్ మ్యూజిక్
- Virat Karna,: నాగబంధం లో సెకండ్ సింగిల్ సుర సుర సాంగ్ చిత్రీకరణ
- మోనాలిసా మిస్సింగ్, రాజస్థాన్ అజ్మేర్కి వచ్చాక మిస్ అయ్యిందంటూ భర్త పోస్ట్
- చర్లపల్లి టెక్కీ ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ - అత్తమామలు - బామ్మర్ది వేధింపులు తాళలేక...
- తనపై తప్పు కేసు పెట్టేందుకు ఈసీతో కలిసి బీజేపీ కుట్ర : మమతా బెనర్జీ
జువ్వలదిన్నెలో జగన్ పర్యటనకు వెళితే రూ.లక్ష ఫైన్ - జాలర్ల పెద్దలు తీర్మానం
నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నెలో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి బుధవారం పర్యటించనున్నారు. అయితే, ఈ పర్యటనకు వెళ్ళే జాలర్లకు లక్ష రూపాయల మేరకు అపరాధం విధిస్తామని జాలర్ల గ్రామ పెద్దలు హెచ్చరించారు. ఈ మేరకు తీర్మానం చేశారు. తమ తీర్మానాన్ని ఉల్లంఘించిన వెళ్లిన వారికి ఏకంగా లక్ష రూపాయల జరినామా విధిస్తామని హెచ్చరించారు. ఇస్కపల్లి, పట్టపుపాలెం గ్రామాలకు చెందిన జాలర్లు ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయించారు.
జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నుంచి నాలుగు బోట్లు అదృశ్యమైన ఘటనే ఈ వివాదానికి కారణమైంది. గతంలో తమిళనాడుకు చెందిన ఆ బోట్లను అక్రమంగా చేపల వేటాడుతున్నాయని స్థానిక మత్స్యకారులు పట్టుకుని హార్బర్‌లో ఉంచారు. అయితే, ఇటీవల ఆ బోట్లు మాయం కావడంతో వివాదం మొదలైంది. ఈ బోట్ల అదృశ్యం వెనుక టీడీపీ ఎంపీ బీదా మస్తాన్ రావు, ఆయన సోదరుడు, ఎమ్మెల్యే బీదా రవిచంద్ర హస్తం ఉందని స్థానిక జాలర్లు ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలో బీదా సోదరులపై దురాయి (సామాజిక బహిష్కరణ) విధించారు. వారితో మాట్లాడినా లక్ష రూపాయలు జరిమానా కట్టాలని తీర్మానించారు. ఇపుడు తాజాగా జగన్ పర్యటనపైనా ఇదే తరహా నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. బోట్ల వ్యవహారం పూర్తిగా తేలేవేరకు టీడీపీ, వైకాపా సహా ఏ రాజకీయ పార్టీ నేతలను కలవకూడదని వారి కార్యక్రమాలకు హాజరుకాకూడదని జాలర్ల పెద్దలు స్పష్టం చేశారు.
తర్వాతి కథనం
