1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. YSRCP condemns action against social media activists in Andhra; terms it vindictive

ఉగ్రవాదులపై ప్రయోగించే ఉపా చట్టాన్ని ఇలా ఉపయోగిస్తారా? అంబటి రాంబాబు

ambati rambabu
ఏపీలో ఎన్డీఏ పాలనలో వైఫల్యాలను ఎత్తిచూపే సోషల్ మీడియా కార్యకర్తలపై ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. బాధితులు ఏ పార్టీకి చెందినవారైనప్పటికీ వారికి అండగా నిలబడుతామని ఆ పార్టీ స్పష్టం చేసింది. 
 
కేవీఆర్, రావణ్ వంటి యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్లను వేధించడం, వారిని జైలుకు పంపే వరకు కేసులను పట్టుబట్టి కొనసాగించడం ద్వారా కూటమి ప్రభుత్వం తన గోతిని తానే తవ్వుకుంటోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరులో మీడియాతో వెల్లడించారు. 
 
ప్రభుత్వ కక్షపూరిత ధోరణి బయటపడినందున, బాధితులకు వైకాపా అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రశ్న రావణ్ అలియాస్ బచలకుర జోసెఫ్ విషయంలో ప్రభుత్వం హద్దులు దాటి వ్యవహరించిందని..  అతనిని వేధింపులకు గురిచేస్తుందని అంబటి ఆరోపించారు. 
 
రిమాండ్ పొందడంలో విఫలమైనప్పుడు, అతనిపై మోపిన కేసులోని సెక్షన్లను మార్చి, చివరికి నెల్లూరు జైలుకు రిమాండ్ అయ్యేలా చేశారని మండిపడ్డారు. 
 
సాధారణంగా ఉగ్రవాదులపై ప్రయోగించే ఉపా (చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం)ను, తమ స్వార్థ ప్రయోజనాల కోసం అధికారంలో ఉన్నవారు అతనిపై ప్రయోగించారని వైకాపా నేత అంబటి ఫైర్ అయ్యారు. 
 
చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే ఉద్దేశంతో, నిందితుడిని తమకు అప్పగించాలని జనసేన పార్టీ కార్యకర్తలు పోలీసులపై ఒత్తిడి తీసుకురావడం న్యాయ వ్యవస్థను అవమానించడమేనని ఆయన అన్నారు.
 
రావణ్‌ను ఉంచిన వివిధ పోలీస్ స్టేషన్ల వద్ద జనసేన కార్యకర్తలు ఆందోళనలు చేస్తూ, ఆ యూట్యూబర్‌ను తమకు అప్పగించాలని డిమాండ్ చేసిన ఘటనను కూడా అంబటి ప్రస్తావించారు. బాధితులను నిందితులుగా మార్చడం కూటమి ప్రభుత్వానికి అలవాటుగా మారిందని దుయ్యబట్టారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
ఆ రెండు పద్ధతులతో మామిడి రైతులు బాగా సంపాదించవచ్చు.. అడ్లూరి లక్ష్మణ్