గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 7 నవంబరు 2016 (10:29 IST)

నారా లోకేష్‌పై ఆర్కే.రోజా విసుర్లు... కమెడియన్‌కు ఎక్కువ... విలన్‌కు తక్కువు

టీడీపీ యువనేత నారా లోకేష్‌పై వైకాపా ఎమ్మెల్యే, నటి ఆర్కే.రోజా మరోమారు విమర్శనాస్త్రాలు సంధించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షం లేదని నారా లోకేష్ వ్యాఖ్యానించడం హాస్యాస్పదమన్నారు. అందుకే ఆయనకు మ

టీడీపీ యువనేత నారా లోకేష్‌పై వైకాపా ఎమ్మెల్యే, నటి ఆర్కే.రోజా మరోమారు విమర్శనాస్త్రాలు సంధించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షం లేదని నారా లోకేష్ వ్యాఖ్యానించడం హాస్యాస్పదమన్నారు. అందుకే ఆయనకు మొద్దబ్బాయ్ అని ప్రతి ఒక్కరూ పిలుస్తున్నారని గుర్తు చేశారు.
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ లోకేష్ మాటలు చూస్తుంటే, ఆయన అవగాహనా రాహిత్యం ఏ స్థాయిలో ఉందో ఇట్టే తెలిసిపోతుందన్నారు. లోకేష్ కామెడీ నటుడికి ఎక్కువ, కామెడీ చేసే విలన్‌కు తక్కువ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఎంపీలతో రాజీనామాలు చేయించేందుకు సిద్ధమని జగన్ స్పష్టం చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, టీడీపీ ఎంపీలతో చంద్రబాబు కూడా రాజీనామా చేయిస్తారా? అని ప్రశ్నించారు.