తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తథ్యమని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖామంత్రి కె.జానారెడ్డి నమ్మకం వ్యక్తం చేశారు. ఈ ఏర్పాటు కూడా 2014 లోపే ఏర్పాటవుతుందన్న నమ్మకం తనకు ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న మంత్రి జానారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే ప్రక్రియలో భాగంగా అతి త్వరలోనే తెలంగాణ నాయకులు మరోసారి ఢిల్లీకి వచ్చి అధినాయకత్వంతో సమావేశమవుతారన్నారు.