దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్సభ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా చివరి ఐదవ విడత పోలింగ్ ప్రారంభమైంది. ఈ పోలింగ్ ఏడు రాష్ట్రాలు మరియు రెండు కేంద్ర పాలిత ప్రాంతాలలో మొత్తం 86 ఎంపీ సీట్లకుగాను బుధవారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ రోజు సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కార్యక్రమం జరుగుతుంది. ఎన్నికల ఫలితాలు మేనెల 16వ తేదీన ప్రకటించడం జరుగుతుంది.