రాష్ట్రంలో ఏప్రిల్ నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు సంబంధించి టైమ్స్ నౌ సంస్థ నిర్వహించిన ప్రీ పోల్ సర్వే ప్రకారం మహాకూటమికే ఎక్కువ లోక్సభ స్థానాలు దక్కనున్నాయని తెలిపంది. ఆంధ్రప్రదేశ్లోని 42 లోక్సభ స్థానాలకుగాను కాంగ్రెస్ పార్టీ 15, తెలుగుదేశం పార్టీ 15, తెలంగాణ రాష్ట్ర సమితి 5, ప్రజారాజ్యం పార్టీ 4, లెఫ్ట్ పార్టీలు చెరి ఒకటి(2), ఎంఐఎం 1 స్థానాల్లో గెలుపు సాధిస్తాయని ఆ సర్వే వెల్లడించింది.