అన్నవరం సత్యదేవుడిని దర్శించినా, సత్యనారాయణుడి వ్రతం ఆచరించినా సర్వపాపాలు తొలగిపోతాయనీ.. సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని భక్తుల విశ్వాసం. అడిగిన వరాలన్నీ ఇచ్చే దేవుడు కాబట్టి అన్నవరం సత్యదేవుడిగా భక్తులచే పూజలందుకుంటున్న ఈ స్వామి ఆలయానికి శతాబ్దాల చరిత్ర కలదు. భక్తులపాలిట కొంగుబంగారమై విరాజిల్లుతున్న ఈ క్షేత్రంలో తయారయ్యే ప్రసాదం అమృతంకంటే రుచిగా ఉంటుందంటే అతిశయోక్తి కాదు. కార్తీక మాసంలో కనీవినీ ఎరుగని రీతిలో భక్తులు తరలివచ్చే ఈ ఆలయ విశేషాలేంటో అలా చూసి వద్దామా..?!