అది కూల్ స్పాట్ కాదు... మనీ మేకింగ్ స్పాట్

Venkateswara Rao. I|
చిత్తూరు జిల్లాలో కూల్ స్పాట్‌గా పేరొందిన ప్రదేశం హార్సిలీ హిల్స్. ఈ ప్రదేశాన్ని రాష్ట్రం నలుమూలలనుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు సందర్శిస్తుంటారు. అయితే తాజాగా హార్సిలీ హిల్స్‌కు వెళ్లే దారిలో టోల్‌గేట్ వెలసింది.

ఇందులో ఆశ్చర్యం ఏముందీ... అనుకుంటున్నారా...? కచ్చితంగా ఉంది. ఎటువంటి నోటిఫికేషన్లు, టెండర్లు లేకుండానే ఇది ఏర్పాటైంది. దీని పేరు చెప్పి పర్యాటకుల నుంచి వేలకు వేలు డబ్బులు దండుకున్నారు దళారులు. ఏకంగా సబ్‌కలెక్టరు పేరిట బిల్లును కూడా ఇచ్చేస్తున్నారు.

అదేమని అడిగినవారిపై దౌర్జన్యానికి దిగుతున్నారు. సంబంధిత అధికారులను ఈ టోల్‌గేట్ వ్యవహారంపై వివరాలను అడిగితే సరైన సమాధానం రావడం లేదు. అసలు ఈ అక్రమ వసూళ్ల వెనుక ఎవరి హస్తం ఉన్నదో తేల్చాలని కోరుతున్నారు పర్యాటకులు.


దీనిపై మరింత చదవండి :