ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణలోని ప్రధాన ఘట్టాలు

WD|
నేటి తరం వారికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరణ ఏవిధంగా జరిగిందో తెలియక పోవచ్చు. అయితే వారికి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నప్పటికీ.. సమాచారం సేకరించే సమయం, తీరిక వారికి ఉండదు. అలాంటి వారికోసం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ సమాచారాన్ని కింది ఇస్తున్నాం.

ముఖ్యంగా ఆధునిక ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో మూడు ముఖ్యమైన చారిత్రక ఘట్టాలున్నాయి.

మధ్య యుగంలో కాకతీయులు, విజయనగర రాజులు, చోళులు, చాళుక్యులు, రెడ్డి రాజులు మొదలైన అనేక వంశాల పాలనలో ఉంటూ వచ్చిన ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్‌ 19వ శతాబ్దం ఆరంభం నాటికి కొంత భాగం బ్రిటిషు వారి పాలనలోను, మరికొంత నిజాం నవాబు ఏలుబడిలోను ఉంది. సర్కారులుగాను, రాయలసీమగాను, హైదరాబాదుగాను విడిపోయి ఉన్న ఈ ప్రాంతాలను కలిపే మూలసూత్రం - వీరి మాతృభాష అయిన తెలుగు. ఒకే రాష్ట్రంగా ఏర్పడాలన్న ఆకాంక్ష అన్ని ప్రాంతాల ప్రజలలోను బలంగా ఉండేది.

బ్రిటిషు వారి పాలనలో ఉన్న సర్కారు (కోస్తా) జిల్లాలు, రాయలసీమ జిల్లాలు ప్రత్యేక రాష్ట్రం కోసం ముందు ఉద్యమించారు. ఈ ప్రాంతం, తమిళ ప్రాంతాలతో పాటు మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేవి. ఆర్ధిక, రాజకీయ రంగాల్లో తమిళుల అహేతుక ఆధిపత్యం భరించలేక, తమకంటూ ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలన్న బలీయమైన కోరిక వలనా వీరు ప్రత్యేక రాష్ట్ర దిశగా ముందు ఉద్యమించారు.

హైదరాబాదు సంస్థానం కథ వేరుగా ఉండేది. నిజాం ఏలుబడిలో ఉన్న వీరు, స్వాతంత్ర్యం తరువాత ప్రత్యేక దేశంగా ఏర్పడాలన్న నిజాము ఆలోచనకు వ్యతిరేకంగాను, నిజాం యొక్క రజాకార్ల దౌష్ట్యాన్ని ఎదిరించేందుకు గాను నడుం కట్టారు. నిజాము పాలన నుండి బయటపడి భారత దేశంలో విలీనం కావాలన్నదే అప్పటి వీరి ప్రధాన లక్ష్యం.


దీనిపై మరింత చదవండి :