అత్యద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని కళ్లముందు ఆవిష్కరించే కట్టడాలు, మానసికానందాన్ని పంచే మనోహర ప్రదేశాలు, చారిత్రక ప్రాధాన్యాన్ని తెలిపే కోటలు, పచ్చని ప్రకృతితో మైమరిపించే కొండలు, కోనలు, లోయలు, వాగులు, వంకలు, పక్షుల కిలకిలా రావాలు.. ఇలా ఒకటేమిటి ఎన్నో అపురూప ప్రదేశాలను కొంగున ముడి వేసుకున్న అందాల తెలుగింటి జిల్లా మెదక్. ఈ జిల్లాలో ఆహ్లాదం, ఆధ్యాత్మికత మేలి కలయికతో.. ప్రకృతి ఆరాధకులకు, ఆధ్యాత్మిక చింతన కలవారికి, సరదాగా గడపాలనుకునే పర్యాటకులకు రారామ్మని ఆహ్వానం పలికే ఒక ప్రదేశం ఏడుపాయల...