ఈ నెల 23 నుంచి అజంత-ఎల్లోరా ఫెస్టివల్

ఔరంగాబాద్ (ఏజెన్సీ)| Selvi| Last Modified శనివారం, 10 నవంబరు 2007 (13:15 IST)
చారిత్రాత్మక అజంత-ఎల్లోర శిల్పాల ప్రాశస్త్యాన్ని వ్యాపింపజేసే దిశగా ఈ నెల 23వ తేదీ నుంచి అజంత-ఎల్లోర ఫెస్టివల్‌ను నిర్వహించనున్నారు. ప్రతి ఏడాది జరిగే ఈ 17వ శతవార్షిక ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజైన 23వ తేదీన "గజల్" గాయకుడు గులామ్ అలీ, చిత్రకారుడు అబ్జిత్ పొహన్కార్‌లు పాల్గొననున్నారని జిల్లా కలెక్టర్ మరియు ఫెస్టివల్ సబ్-కమిటీ ఛైర్మన్ సంజీవ్ జైస్వాల్ విలేకరులతో చెప్పారు.

ఈ సంగీత ఉత్సవాల్లో భాగంగా తొలిరోజున ఉస్తాద్ అబ్జద్ అలీ ఖాన్ సరోద్ వాదన, పండిత్ ప్రభాకర్ హిందూస్థానీ గాత్ర సంగీతం, అనురాధా పాల్ (తబల) మరియు ఫ్రెంచ్ నేషనల్ దేవయాని భరతనాట్యం వంటి కార్యక్రమాలు జరుగనున్నాయి.

అంతేకాకుండా షర్బని ముఖర్జీ రాధిక- ఆధ్యాత్మిక గాత్ర సంగీతం, దేష్ పండే, గజ్ర కాంబినేషన్‌లో జానపద సంగీత కచేరీలు కూడా జరుగనున్నాయని జైస్వాల్ అన్నారు. ఈ ఉత్సవాల చివరిరోజున అనుయా దేశ్‌ముఖ్ భరతనాట్యం, సంజయ్ జోషి, ధనశ్రీ దేవ్, రోహిణి సింగావేర్, ముకుంద్ పాండె మరాఠి నాట్య సంగీత కచేరీ జరుగనుందని ఆయన వివరించారు.


దీనిపై మరింత చదవండి :