ఎకో టూరిజం స్పాట్‌గా గండికోట

Venkateswara Rao. I|
కడప జిల్లాలోని గండికోటను ఎకో టూరిజం స్పాట్‌గా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనితో గండికోట ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి వైఎస్ ఆశయం నెరవేరనుంది.

గండికోటకు కింది భాగాన మైలవరం జలాశయం ఉండటం, ఎగువున మరో జలాశయం పనులు పూర్తి కావడంతో గండికోటను ఎకో టూరిస్ట్ స్పాట్‌గా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.

ఈ పర్యాటక కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం 2 వేల ఎకరాలను కేటాయించింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు కానున్న ఈ పర్యాటక కేంద్రంలో హోటల్స్, థీమ్ పార్క్, లైట్ షోస్, ఇతర నిర్మాణాలను చేపట్టనున్నారు.

వీటితోపాటు సహజసిద్ధంగా ఏర్పడి ఉన్న పెద్ద గుహలు, రెండు కొండల నడుమ గలగలా పారే పెన్నా నది హొయలు పర్యాటకుల మదిని మరో లోకానికి తీసుకెళతాయి. మొత్తానికి గండికోట అందానికి మరింత అందం తోడవుతోంది.


దీనిపై మరింత చదవండి :