ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హిల్ స్టేషన్లలో ఒకటి అరకు అనంతగిరి. ఇది విశాఖపట్నానికి 40 కిలోమీటర్ల దూరంలోనూ, రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాదుకు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రశాంతమైన ప్రకృతి నడుమ దట్టమైన అడవులు, పచ్చని చెట్లు, ముగ్ధ మనోహర దృశ్యాలతో రంజింపజేసే ఈ ప్రాంతం ప్రకృతి ప్రేమికులకు ఓ సరికొత్తలోకంలోకి తీసుకెళ్తుంది. అనంతగిరిలో వాతావరణం ఎల్లప్పుడూ చల్లగా, కమనీయంగా ఉండటంతో సంవత్సరంలో ఏ కాలంలో అయినా అక్కడికి వెళ్లవచ్చు.