గుప్త నిధులకోసం చారిత్రక కట్టడాలు ధ్వంసం

Venkateswara Rao. I|
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం పరిధిలోని దాసరపల్లి కృష్ణమ్మ కొండలో అక్రమార్కులు గుప్తనిధులకోసం తవ్వకాలు చేస్తున్నారు. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో యుద్ధ సమయంలో తప్పించుకునేందుకు గాను ఉదయగిరి నుంచి దాసరపల్లి కృష్ణమ్మ కొండలో సొరంగాన్ని నిర్మించారు.

ఈ సొరంగంలో గుప్త నిధులు ఉన్నాయని భావించిన అంతర్ రాష్ట్ర దొంగల ముఠా తవ్వకాలకు పాల్పడింది. గతంలోనూ తవ్వకాలు చేస్తున్న ఆనవాలు కనబడటంతో పోలీసులు, స్థానికులు అడ్డుకున్నారు. ఇప్పుడు మళ్లీ తిరిగి తవ్వకాలు నిర్వహిస్తూ చారిత్రక కట్టడాలను ధ్వంసం చేయడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు కల్పించుకుని అక్రమార్కుల ఆగడాలను అడ్డుకోవాలని అభ్యర్థిస్తున్నారు.


దీనిపై మరింత చదవండి :