శతాబ్దాల చరిత్రను తనలో ఇముడ్చుకుని, ఆ చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచిన పురాతన దేవాలయం మిడ్తూరులోని శ్రీ లక్ష్మీ చెన్న కేశవ ఆలయం. శిల్ప సంపదకు, ప్రకృతి రమణీయతకు ప్రతీకగా నిలిచిన ఈ ఆలయం ఆంధ్రరాష్ట్రంలోని కర్నూలు జిల్లాలోనే అతిపెద్ద ఆలయంగా విరాజిల్లుతోంది. సూర్యభగవానుడంతటివాడు ప్రతియేటా స్వామివారి పాద పూజ చేసి తరిస్తుండటం విశేషంగా చెప్పుకునే ఈ ఆలయాన్ని ఓసారి దర్శిద్దామా..?!