ట్రెక్కింగ్‌, రాక్‌ క్లైంబింగ్‌‌లతో సాహసాలు చేద్దామా..?!

Boating
Ganesh|
FILE
ఓ వైపు కింద పరవళ్లు తొక్కుతూ ప్రవహించే నదీ ప్రవాహం.. పైన తాళ్లతో వేలాడే చెక్క వంతెన... అడుగులో అడుగు వేసుకుంటూ ఆ వంతెనపై నడుస్తూ నదిని దాటాలంటే ఎవరికైనా గట్స్ ఉండాల్సిందే..! మరోవైపు పెద్ద లోయ.. కిందికి చూస్తే ప్రాణాలు పైపైనే పోతాయన్న భయం.. అలాంటి చోటుకి కొండ పైనుంచి కిందికి తాళ్లతో జారుకుంటూ పోతే... తలచుకుంటే ఒళ్లు గగుర్పొడుస్తోంది కదూ...? అలాగే.. గలగలా పారే నదిలో రయ్‌మంటూ దూసుకెళ్లే మరపడవ.. ఆ పడవలో మీరు భలే ఉంటుంది కదా..! ఇలాంటి సాహసాలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ పలు ప్యాకేజీలను నిర్వహిస్తోంది.

సాహసాలు అనేవి మనసుకు థ్రిల్లింగ్‌ను కలిగిస్తాయి. అవి శరీరానికి మంచి వ్యాయామం కూడా.. ఉరుకుల పరుగుల జీవితంలో విసుగెత్తిపోయేవారు ఇలాంటి ప్రదేశాల్లో ఒక రోజంతా సేదతీరవచ్చు. ఇందుకోసం ఏపీ పర్యాటక శాఖ అనేక రకాల పర్యాటక ప్రదేశాలను ఎంపిక చేసి.. అక్కడ అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తోంది. సుదూర ప్రాంతాలతోపాటు హైదరాబాద్ నగరానికి సమీపంలోగల గుట్టవద్ద ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్ లాంటివి నిర్వహిస్తోంది.
హార్స్‌లీ హిల్స్‌లో ట్రెక్కింగ్..!
హార్స్‌లీ హిల్స్... రాక్‌ క్లైంబింగ్‌, ట్రెక్కింగ్‌ చేసే వారికి ఎంతో అనువైన ప్రదేశం. ఇక్కడ రోప్‌వే సౌకర్యం కూడా ఉంది. ప్రకృతి సోయగాల మధ్య.. చల్లటి పిల్ల గాలులు శరీరాన్ని అలా తాకుతూ వెళుతుంటే ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. ఈ ప్రాంతానికి కూడా పర్యాటక..


ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్, రివర్ క్రాసింగ్, బోట్ రైడింగ్ తదితర సాహసాలకు ఎక్కడో విదేశాలకు లేదా పక్క రాష్ట్రాలకు పరుగులు తీయాల్సిన అవసరం లేదు. మన రాష్ట్రంలోనే ఇలాంటి పర్యాటక ప్రదేశాలు బోలెడన్ని ఉన్నాయి. నాగార్జున సాగర్, శ్రీశైలం, యాదగిరి గుట్ట, భద్రాచలం, కుప్పం, బాసర, హార్స్‌లీ హిల్స్ తదితర ప్రాంతాలు.. అలాంటి వాటిలో కొన్ని. ఈ ప్రాంతాల్లో పర్యాటక శాఖ అన్ని అవకాశలను కల్పించటంతోపాటు.. పగలు, రాత్రి వేళల్లో అక్కడే ఉండి గడిపే విధంగా కూడా ప్యాకేజీలను రూపొందించిది. ఇక.. వసతి, భోజన సౌకర్యాలు కూడా ఆ శాఖే చూస్తుంది కాబట్టి.. దిగులేమీ ఉండదు.

ఆ ప్యాకేజీలేంటో ఇప్పుడు చూద్దామా...?!

కీసర గుట్ట...
హైదరాబాద్‌కు సమీపంలో ఉంది. ఇక్కడ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రాక్‌ క్లైంబింగ్‌ నిర్వహిస్తున్నారు. గ్రూపుల వారీగా వెళ్లిన వారికి ప్రత్యేక రాయితీలు ఉంటాయి కూడా. అయితే రవాణా సౌకర్యాలను మాత్రం పర్యాటకులే చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ క్లైంబింగ్‌కు మాత్రం గ్రూపును బట్టి కొంత రుసుమును వసూలు చేస్తుంటారు.


దీనిపై మరింత చదవండి :