ఇంద్రధనుస్సు చీరను కట్టుకుని హొయలొలికించే పరిసరాలు, వినసొంపైన సంగీతాన్ని ఆలాపించే అలలు, చెరువు నడుమన చిన్న చిన్న ద్వీపాలు, వాటి మధ్యలో గాలిలో ఊగుతూ వంతెన... ఆ వంతెనపై నడుస్తూ... చుట్టూ ఉండే ప్రకృతి సౌందర్యాన్ని తనివితీరా ఆస్వాదిస్తూ... ఆహా..! ఇంత అందమైన ప్రాంతానికి ఒక్కసారైనా వెళ్తే ఎంత బాగుంటుందోనని మనసు ఉవ్విళ్లూరుతోంది కదూ..?! అయితే మరెందుకు ఆలస్యం.. వెంటనే లక్నవరం ట్రిప్ వేసేస్తే సరి..!