సాగర తీరంలో విరబూసిన ప్రకృతి అందాల పరిమళాలతో పర్యాటకులను ఆకట్టుకుంటున్న ప్రాంతమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాకు చెందిన రామాయపట్నం. గుడ్లూరు, ఉలవపాడు అభయ మండలాల మేలి కలయికతో ఏర్పడ్డ ఈ సముద్ర తీర ప్రాంతం ఆనాటి తెల్లదొరల కాలంలోనే పర్యాటక కేంద్రంగా గుర్తించబడింది. స్వదేశీయులేగాక, విదేశీయులు సైతం సేద తీర్చుకునేందుకు ఆనాడే ఇక్కడ విశ్రాంతి మందిరాలు సైతం వెలసి.. పర్యాటకులను సాదరంగా స్వాగతించింది...