పర్యాటక కేంద్రంగా వరంగల్

WD
చారిత్రాత్మక నేపధ్యంగల వరంగల్ జిల్లాను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి పలు అభివృద్ధి పనులను చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ బి. జనార్థన్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో చేపట్టవలసిన పర్యాటక అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

Sridhar Cholleti|
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పర్యాటక ప్రాంత అభివృద్ధికోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నాయని అన్నారు. ఈ నిధులతో పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. లక్నవరం జలాశయాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి భారత ప్రభుత్వం 4 కోట్ల 68 లక్షల రూపాయలను మంజూరు చేసిందని తెలిపారు.


దీనిపై మరింత చదవండి :