పల్లెలో వలస పక్షుల సందడి

WD
నగర, పట్టణాల్లో నివాసముంటున్న పిల్లలు, పెద్దలు వలస పక్షులు గురించి చదువుకోవడం తప్పించి అవి ఎలా ఉంటాయో... బహుశా చూసి ఉండరు. కానీ పల్లెవాసులను ప్రతి ఏటా పలుకరిస్తుంటాయి ఈ వలస పక్షులు. దేశం నలుమూలల నుంచి పచ్చ పచ్చని పల్లెలపై రెక్కల కట్టుక వాలుతాయి. ఇప్పుడీ వలస పక్షుల గోడు ఏమిటీ అనుకుంటున్నారా....?

అక్కడికే వస్తున్నా... వలస పక్షులకు మెట్టినిల్లుగా చెప్పుకునే కొల్లేరు సరస్సుకు కూతవేటు దూరంలో ఉన్న పచ్చపచ్చని చెట్లను ఆరు నెలలపాటు తమ ఆవాసాలుగా చేసుకునేందుకు వస్తుంటాయి వలస పక్షులు. ఆస్ట్రేలియా, నైజీరియా, సైబీరియా వంటి దేశాల నుంచి వచ్చే ఈ పక్షులు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి.

వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT|
పక్షుల రాకతో తమ పల్లెలకు కొత్త కళ వస్తుందంటారు ఆ ప్రాంత వాసులు. వలస పక్షులను చూసేందుకై తమ బంధువులు సైతం తమ ఊరికి వస్తుంటారంటారు. అయితే ఇదివరకటి రోజుల్లో పక్షుల నివాసంకోసం ప్రత్యేకమైన శ్రద్ధ కనబరచాల్సిన అవసరం ఉండేది కాదు. నేడు క్షీణిస్తున్న అటవీ సంపద దృష్ట్యా వాటి నివాస యోగ్యానికి అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు అరుదైన పక్షులు వేటగాళ్ల బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.


దీనిపై మరింత చదవండి :