పురాతన సంస్కృతీ నిలయాలు బెలూం గుహలు

Munibabu| Last Modified బుధవారం, 1 అక్టోబరు 2008 (18:47 IST)
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో వెలసిన బెలూం గుహలు మన పురాతన సంస్కృతికి నిలయాలుగా ఉన్నాయి. కర్నూలు జిల్లాలోని కొలిమిగుంట్ల మండలంలో ఉన్న ఈ బెలూం గుహలు దాదాపు పది లక్షల ఏళ్ల క్రితం సహజసిద్ధంగా ఏర్పడినవి కావడం విశేషం.

భారత ఉపఖండంలోనే రెండో అతిపెద్ద గుహల సముదాయంగా పేరు సంపాదించిన ఈ బెలూం గుహలను ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ సంరక్షిస్తోంది.

బెలూం గుహల చరిత్ర
నిపుణుల అంచనాల ప్రకారం బెలూం గుహలు దాదాపు పది లక్షల ఏళ్ల క్రితం సహజసిద్ధంగా ఏర్పడ్డాయి. అలాగే దాదాపు క్రీ.పూ. 4,500 ప్రాతంలో ఈ బెలూం గుహల్లో మానవులు నివశించినట్టు కూడా ఆధారాలు లభించాయి. ఇంతటి ప్రాముఖ్యత కల్గిన ఈ బెలూం గుహల సముదాయం 1982 ప్రాంతంలో ప్రపంచం దృష్టికి వచ్చాయి.

జర్మనీకి చెందిన డేనియల్ జెబోర్ నేతృత్వంలోని నిపుణుల బృందం ఈ బెలూం గుహల విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. దీంతో 1985లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ గుహలను తన ఆధీనంలోకి తీసుకుంది. అలాగే 1999 నుంచి ఆంధ్రప్రదేశ్ పర్యాటక సంస్థ ఈ బెలూం గుహలను తమ అధీనంలోకి తీసుకుని అక్కడ విస్తరణ కార్యక్రమాలు మొదలు పెట్టింది.
దీనిపై మరింత చదవండి :