ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, మహబూబ్‌నగర్ జిల్లాలోని ఓ గ్రామం పేరే ఆలంపూర్. ఇదే పేరుతోనే గల ఓ మండలానికి ఆలంపూర్ కేంద్రం కూడా. చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ ప్రాంతాన్ని... సుమారు ఆరవ శతాబ్ద మధ్య కాలం నుండి రెండువందల సంవత్సరాలపాటు బాదామి చాళుక్యులు పరిపాలించారు. తుంగభద్ర, కృష్ణానదులు కూడా ఆలంపూర్‌కు దగ్గర్లోనే కలుస్తాయి. ఈ ప్రాంతంలోని తొమ్మిది నవబ్రహ్మ దేవాలయములు కూడా శివాలయాలే కావడం చెప్పుకోదగ్గ అంశం.