భూగర్భ ఊహాతీత ప్రకృతి ప్రసాదం "బెలూం గుహలు"

Caves
Ganesh|
FILE
బెలూం గుహలను సందర్శించాలనుకుంటే ప్రకృతిని ఆస్వాదించగల హృదయం, కాస్తంత గుండె ధైర్యం ఉండి తీరాల్సిందే. గుహల లోలోపలికి వెళుతుంటే అదో సరికొత్త ప్రపంచంలా అనిపిస్తుంది. ఆ కొత్త ప్రపంచంలో మనమూ లీనమై, మమేకమై తన్మయత్వంతో ప్రతి అంగుళాన్ని కొత్తగా, వింతగా దర్శిస్తాం. అలాగే ముందుకెళ్తే ఆశ్చర్యం, ఆనందం, ఉద్వేగంతో ఉక్కిరిబిక్కిరైపోయే ఈ అద్భుత ప్రదేశంలో పర్యటించటమే ఓ గొప్ప అనుభూతిగా మదిలో మిగిలిపోతుంది.

మరి ఇంత అందమైన, ఆశ్చర్యకరమైన బెలూం గుహల్ని దర్శించాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మండలానికి చేరుకోవాల్సిందే. అక్కడినుంచి 5 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే బెలూం గుహలను చేరుకోవచ్చు. భారత ఉపఖండంలో మేఘాలయా గుహల తరువాత వీటినే రెండవ అతిపెద్ద గుహలుగా అంచనా వేస్తున్నారు. అత్యంత సహజంగా, అతి పురాతన కాలంలో ఏర్పడిన ఈ గుహల సౌందర్యం వర్ణనాతీతం.

దేశ, విదేశీ, స్థానిక పర్యాటక కేంద్రంగా అలరారుతున్న ఈ బెలూం గుహల ప్రత్యేకత అంతా ఇంతా కాదు. పొడవైన సొరంగ మార్గాలు, జాలువారే శిలాస్ఫటికాలు, రకరకాల శిలాకృతులు, అడుగడుగునా అబ్బురపరిచే అద్భుతాలు.. ఇలా వేటికవే ప్రత్యకత సంతరించుకున్న అద్భుతాలు ఈ గుహల్లో ఎన్నో మరెన్నో.
బిలంలాగా ఉండేదనీ...
పూర్వం ఈ గుహల్లోకి వెళ్లేదారి బిలంలాగా ఉండేదనీ, అందుకే వీటిని బిలం గుహలుగా పిలిచేవారని, అదే పేరు కాలక్రమంలో బెల్లం గుహలుగా కాలక్రమేణా పేరుమార్చుకున్నాయని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. ఇకపోతే.. ఈ గుహలు విశాఖపట్నం జిల్లాలో ఉన్న బొర్రా గుహలకంటే...


బెలూం గుహల చరిత్రను చూస్తే.. ఈ గుహలు పది లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడినట్లు పురాతత్వ శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు. క్రీస్తు పూర్వం 4,500 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో మానవులు నివసించినట్లు ఈ గుహల్లో లభించిన మట్టి పాత్రలవల్ల తెలుస్తోంది. 1884లో మొట్టమొదటిసారిగా రాబర్ట్ బ్రూస్ ఫూట్ అనే ఆంగ్లేయుడు ఈ గుహల ఉనికి గురించి ప్రస్తావించాడు. తరువాత ఒక దశాబ్దంపాటు వాటి గురించి ఎవరూ పట్టించుకోలేదు.

అయితే 1982లో డేనియల్ జెబోర్ నాయకత్వంలో గుహలకు సంబంధించిన జర్మన్ నిపుణుల బృందం ఈ గుహలను సందర్శించి, పరిశీలించింది. ఆ తరువాతనే వాటి ఉనికి ప్రపంచానికి వెల్లడయ్యిందని చెబుతుంటారు. సుమారు భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉన్న ఈ గుహలను సందర్శించేందుకు 2002 ఫిబ్రవరి నెల నుంచి పర్యాటకులకు అనుమతిచ్చారు.

ఇక అప్పటినుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ గుహలను, వాటి చుట్టుప్రక్కల ప్రాంతాలను అభివృద్ధి చేస్తోంది. 1985లో బెలూం గుహలను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీన పరచుకోగా, 1999లో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధీనంలోకి వచ్చాయి. పర్యాటకుల సౌకర్యార్థం 1.5 కిలోమీటర్ల మేర గుహలలో సిమెంట్, స్లాబ్ రాళ్లతో నడిచేందుకు అనువుగా పర్యాటక శాఖ దారిని నిర్మించింది.


దీనిపై మరింత చదవండి :