విశాఖపట్టణానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉండే అనంతగిరులు సౌందర్యం వర్ణనాతీతం. తూర్పుకనుమలలో భాగంగా విస్తరించిన ఇవి సముద్రమట్టానికి 1150మీటర్ల ఎత్తున ఉన్నాయి. విశాలంగా పరచుకొన్న పచ్చదనం, కాఫీతోటలు, జలపాతాలు, గుబురుచెట్లు.. ఈ ప్రాంతంలో వాటి అందాలను ఆశ్వాదిస్తూ నడకసాగించడం ఒక అందమైన అనుభవం.