ప్రకాశం జిల్లా రాచర్ల మండలం, గౌతువరం గ్రామస్థులు విదేశీ పక్షుల సందడితో పులకించి పోతున్నారు. ప్రతి ఏడాది జూలై నెలలో పలు దేశాలకు చెందిన విదేశీ పక్షులు ఈ మారుమూల గ్రామానికి వస్తుంటాయి. ఈ పక్షులు చేసే సందడితో ఈ గ్రామం కిలకిలరావాలతో సందడిగా మారుతుంది.