రాజులు పోయినా, రాజ్యాలు పోయినా... వారికి గుర్తుగా ఉన్న గండికోట మాత్రం మిగిలే ఉంది. శ్రీకృష్ణదేవరాయుల కాలంలో ఓ వెలుగు వెలిగిన ఈకోట దాదాపు ఐదు దశాబ్దాలపాటు నాలుగు సామ్రాజ్యాలకు వెన్నుదన్నుగా... హిందూ, ముస్లిం సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకగా విరాజిల్లింది. శతాబ్దాల కాలంనాటి శిల్పకళా సంపదకు నిలువెత్తు రూపంగా నిలిచిన ఈ గండికోట కాకతీయుల పాలనలోనూ, ఆ తరువాత మీర్ జుమ్లా నవాబు పాలనలోనూ సకల కళా వైభవంతోనూ అలరారింది.