కొండలపైనుంచి జాలువారే చిన్న చిన్న జలపాతాలు, సెలయేళ్ళు.. కనువిందు చేసే కోనేరులు.. హరిత వర్ణాన్ని కప్పుకున్న కొండలు, పక్షుల కిలకిలా రావాలు, వన్యప్రాణుల వింత అరుపులతో... ప్రాచీన వైభవానికి సజీవ సాక్ష్యంగా నిలిచిన ప్రాంతమే రాచకొండ గుట్ట. సంప్రదాయ దుస్తులు ధరించి.. పల్లె జీవనం సాగిస్తున్న అమాయక గిరిజన ప్రజలు నివసించే ఈ ప్రాంతాన్ని చేరగానే పర్యాటకులు అలౌకిక ఆనందానికి, అనుభూతికి లోనవకమానరు...