తూర్పు కనుమల్లోని దక్షిణ భాగం కొండల వరుస అయిన హార్సిలీ హిల్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకెల్లా ఎత్తైన ప్రదేశంగా పేరుగాంచింది. ఆంధ్రా ఊటీగా, రాయలసీమ వేసవి విడిదిగా పర్యాటకుల మన్ననలు అందుకుంటున్న ఈ ప్రదేశంలో ప్రకృతి అందాలకు ఏ మాత్రం కొదవలేదు. ఆహ్లాదకరమైన వాతావరణంతో సాగిపోయే హార్సిలీ హిల్స్ కొండదారి పొడవునా.. దారికి ఇరువైపులా అనేక నీలగిరి జాతుల చెట్లు, సంపెంగ తోటలు స్వాగతం పలుకుతున్నట్లుగా ఉంటాయి.