1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. మాసఫలం
  4. Monthly Horoscope for July 2026: Careful planning and bold moves await these zodiac signs

01-07-2026 నుంచి 31-07-2026 వరకు మాస ఫలితాలు - ఈ మాసం నిరాశాజనకం

Monthly Horoscope for July 2026
Monthly Horoscope for July 2026
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఈ మాసం అన్ని రంగాల వారికి యోగదాయకమే. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. వ్యవహారాల్లో చాకచక్యంగా మెలుగుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. తరచు ఆత్మీయులతో సంభాషిస్తుంటారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. వివాహయత్నాలు సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. ఇతరుల తాహతును క్షుణ్ణంగా తెలుసుకోండి. చిన్ననాటి గురువులు తారసపడతారు. గత సంఘటనలు ఉల్లాసం కలిగిస్తాయి. సంతానం ఉన్నత విద్యాయత్నం ఫలిస్తుంది. వ్యాపారాల్లో ఆటుపోట్లను సమర్ధంగా ఎదుర్కుంటారు. మీ పథకాలు మునుముందు సత్ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధాన ఉపాధ్యాయులకు స్థానచలనం కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. రుణవిముక్తులై తాకట్టు విడిపించుకుంటారు. ఖర్చులు భారమనిపించవు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. అనుమానాలు, అపోహలకు తావివ్వవద్దు, పరిచయాలు, బలపడతాయి. ముఖ్య సమాచారం అందిస్తారు. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు పురమాయించవద్దు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. పత్రాల్లో వివరణలు అనుకూలిస్తాయి. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఉద్యోగస్తులకు ఉన్నత పదవీయోగం, వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ఉపాధి పథకాలు చేపడతారు. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
గ్రహసంచారం అనుకూలంగా ఉంది. అనుకున్న లక్ష్యం సాధిస్తారు. మీ సమర్థతపై గురి కుదురుతుంది. ఆదాయానికి తగ్గట్టుగా బడ్జెట్ వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ప్రముఖులను ఆకట్టుకుంటారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. పత్రాలు లభ్యమవుతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. కుటుంబ సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. మీ ప్రమేయంతో ఒక సమస్య సానుకూలం అవుతుంది. సంతానం చదువులపై దృష్టి పెడతారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవతాయి. గృహం సందడిగా ఉంటుంది. ఉపాధి పథకాలు చేపడతారు. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులు వుండవు. చిరువ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు పదోన్నతి. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. ఏకాగ్రతతో వాహనం నడవండి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. పురోగతి లేక నిస్తేజానికి లోనవుతారు. ఖర్చులు వివరీతం. మీ కష్టం మరొకరికి కలిసివస్తుంది. ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగేయాలి. దంపతుల మధ్య అరమరికలు తగవు. వ్యవహారాలతో సతమతమవుతారు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనాన్నిస్తుంది. ఆహ్వానం, నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ఒంటెద్దు పోకడ తగదు. అనుభవజ్ఞల సలహా పాటించండి. సంతానం ఉన్నత విద్యాయత్నం ఫలిస్తుంది, చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త అతిగా శ్రమించవద్దు. వృత్తి ఉద్యోగ బాధ్యతల పట్ల శ్రద్ధ వహించండి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నూతన వ్యాపారాలు కలిసిరావు. ఆకస్మిక ప్రయాణం చేయవలసి వస్తుంది. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అన్ని రంగాల వారికి బాగుంటుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఉభయులకూ మీ సలహా ఆమోదయోగ్యమవుతుంది. స్థిరాస్తి ధనం అందుతుంది. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. వివాహయత్నం ఫలిస్తుంది. కల్యాణ వేదికలు అన్వేషిస్తారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు, ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. పత్రాల్లో మార్పుచేర్పులు అనుకూలిస్తాయి. సంతానం విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. వృత్తి ఉపాధి పథకాలు పురోగతిన సాగుతాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ఉపాధ్యాయులకు స్థానచలనం తప్పనిసరి. వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. వేడుకల్లో అత్యుత్సాహం తగదు.
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కార్యసిద్ధి, వ్యవహారజయం ఉన్నాయి. మాటతీరుతో ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. చాకచక్యంగా అడుగులేస్తారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. ఆదాయం సంతృప్తికరం. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పరిచయస్తులు, ధనసహాయం అర్ధిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. మీ ఇష్టాయిష్టాలను సామరస్యంగా తెలియజేయండి. వేడుకను ఘనంగా చేస్తారు. మీ ఉన్నతి కొందరికి అపోహ కలిగిస్తుంది. విమర్శలు, వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. అవివాహితులు శుభవార్త వింటారు. సంతానం అత్యుత్సాహం అదుపు చేయండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటుపోట్లకు ధీటుగా స్పందిస్తారు. అధికారులకు హోదా చూర్పు, స్థానచలనం, నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ముఖ్యులకు స్వాగతం, వీడ్కోలు పలుకుతారు.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ప్రతి విషయంలోను మీదే పైచేయి. వాగ్దాటితో నెట్టుకొస్తారు. కార్యసిద్ధి, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఆదాయం బాగుంటుంది. వాహనం, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు, కలక పత్రాలు జాగ్రత్త. దంపతులు ఏకాభిప్రాయానికి రాగలుగుతారు. ప్రముఖలతో పరిచయాలు బలపడతాయి. కీలక బాధ్యతలు స్వీకరిస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గృహం నిత్యం సందడిగా ఉంటుంది. సంతానానికి శుభఫలితాలున్నాయి. మీ చొరవతో వివాహసంబంధం కుదురుతుంది. తరచు సన్నిహితులతో సంభాషిస్తుంటారు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. ఉద్యోగస్తులకు బదిలీతో కూడిన పదోన్నతి, ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారాలే కలిసివస్తాయి. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు.
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఈ మాసం ద్వితీయార్ధం అనుకూలం. తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. కొత్తపనులు చేపడతారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. ఆహ్వానం అందుకుంటారు. తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. సంతానం ఉన్నత చదువులు కోసం శ్రమిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలేర్పడతాయి. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు, అనుభవజ్ఞుల సలహా పాటించండి. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. చిన్నవాటి పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నూతన పెట్టుబడులను తరుణం కాదు. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. వేడుకకు హాజరవుతారు. వాహనం ఇతరులకు ఇవ్వవద్దు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
గ్రహాల సంచారం ప్రతికూలంగా ఉంది. వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. పనిభారం, ఒత్తిడి అధికం. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. దంపతుల మధ్య సఖ్యత లోపం. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. ఖర్చులు విపరీతం. గృహోపకరణాలు మరమ్మతుకు గురవుతాయి. ఆత్మీయుల రాక ఉల్లాసాన్ని కలిగిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సంతానానికి ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, అధికారులకు స్థానచలనం. ఆస్తి వివాదాలు కొలిక్కివస్తాయి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఈ మాసం నిరాశాజనకం. ప్రతి విషయంలోను అప్రమత్తంగా ఉండాలి. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. సన్నిహితుల సలహా పాటించండి. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. ఆత్మీయులతో తరచుగా సంభాషిస్తుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఖర్చులు అధికం. చేతిలో ధనం నిలవదు. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంది. మీ శ్రీమతి ప్రోద్బలంతో కొత్తయత్నాలు చేపడతారు. కలిసివచ్చిన అవకాశాన్ని తక్షణం అందిపుచ్చుకోండి. అనుమానాలు, అపోహలకు తావివ్వవద్దు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలంగా సాగుతాయి. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత, పందాలు, బెట్టింగ్లకు పాల్పడవద్దు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
అన్ని రంగాల వారికి కలిసివచ్చే సమయం. లక్ష్యం నెరవేరుతుంది. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. రావలసిన ధనం అందుతుంది. అవసరాలు తీరుతాయి. ఆత్మీయులకు సాయం అందిస్తారు. మీ చొరవతో ఒక సమస్య సానుకూలమవుతుంది. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యం పొందుతారు. సంతానం కదలికలపై దృష్టిపెట్టండి. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్ర వహించండి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు గడిస్తారు. చిరు వ్యాపారులకు ఆశాజనకం. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి ఉద్యోగస్తులకు పదవీయోగం, అధికారులకు హోదా మార్పు, ఏకాగ్రతతో వాహనం నడపండి.
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. వ్యూహాలు, అంచనాలు ఫలిస్తాయి. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. వివాహయత్నం ఫలిస్తుంది. కళ్యాణమంటపాలు అన్వేషిస్తారు. బంధుమిత్రులు రాకపోకలు అధికమవుతాయి. కీలక వ్యవహారాలు మీ సమర్థంలో సాగుతాయి. మీ సలహా ఉభయులకూ ఆమోదయోగ్యమవుతుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. మీ శ్రీమతి ఆరోగ్యం కుదుటపడుతుంది. చిన్ననాటి ఉపాధ్యాయులను కలుసుకుంటారు. పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. విందులు, వేడుకలకు హాజరవుతారు.
About Writer
పి.ప్రసూనా రామన్