01-10-2026 నుంచి 31-10-2026 వరకు మాస ఫలితాలు - ఈ మాసం అన్ని విధాలా యోగదాయకం
October 2026 Horoscope
ఈ మాసం అన్ని విధాలా యోగదాయకం. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. పరస్పరం కానుకలిచ్చిపుచ్చుకుంటారు. ఆదాయం బాగుంటుంది. రుణవిముక్తులై తాకట్టు విడిపించుకుంటారు. ఖర్చులు అధికం, సంతృప్తికరం. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. ఆత్మీయులతో తరచు సంభాషిస్తుంటారు. కొత్తయత్నాలకు శ్రీకారం చుడతారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. కొందరి అలక్ష్యం ఇబ్బంది కలిగిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటుపోట్లకు ధీటుగా స్పందిస్తారు. ఉద్యోగస్తులు, అధికారులకు అదనపు బాధ్యతలు, ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఒత్తిడి, ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవదర్శనంలో అవస్థలెదుర్కుంటారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు
ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం, చేతిలో ధనం నిలవదు. పొదుపుధనం ముందుగానే గ్రహిస్తారు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. దంపతుల మధ్య తరచు అభిప్రాయభేదాలు. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు, దూరపు బంధువుల ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ప్రముఖుల సందర్శనం కోసం పడిగాపులు తప్పవు. మొండిధైర్యంతో అడుగు ముందుకేస్తారు. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహరాలతో తీరిక ఉండదు. అధికారులకు హోదా మార్పు, ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం, వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారాలే కలిసివస్తాయి.
మిథునం :మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
గ్రహాల సంచారం ప్రతికూలంగా ఉంది. ఆచితూచి అడుగు ముందుకు అడుగు వేయండి. తొందరపాటు నిర్ణయాలు తగవు. అనుభవజ్ఞులను సంప్రదించండి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ధనమూలక సమస్యలెదురవుతాయి. సాయం చేసేందుకు అయిన వారే సందేహిస్తారు. అవసరాలకు ఏదో విధంగా ధనం అందుతుంది. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. నిదానంగానైనా పనులు అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు. ఆప్తుల ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. ఇంటి విషయాలపై దృష్టిపెడతారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. మీ పథకాలు ఏమంత ఫలితమీయవు. ఉద్యోగబాధ్యతల పట్ల శ్రద్ధ వహించండి. ఆరోగ్యం బాగుంటుంది. శుభకార్యానికి హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలి వెళ్లకండి.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. పరిచయాలు, బంధుత్వాలు నిలపడతాయి. అందరితోను కలుపుగోలుగా మెలుగుతారు. వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. దైవకార్యాలకు విరివిగా వ్యయం చేస్తారు.. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. సభ్యత్వం, బాధ్యతలు స్వీకరిస్తారు. పోయాయనుకున్న వస్తువులు, పత్రాలు లభ్యమవుతాయి. మానసికంగా స్థిమితపడతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. చిన్ననాటి ఉపాధ్యాయులు తారసపడతారు. గత సంఘటనలు ఉల్లాసం కలిగిస్తాయి. ఉపాధ్యాయులకు పదవీయోగం, ఉద్యోగస్తులకు బాధ్యతల నుంచి విముక్తి. వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు అనుకూలం. సరుకు నిల్వలో జాగ్రత్త. వాహనం ఇతరులకివ్వవద్దు..
సింహం మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
పరిస్థితులు క్రమంగా చక్కబడతాయి. లక్ష్యానికి చేరువుతారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ధనలాభం ఉంది. అవసరాలు నెరవేరుతాయి. చెల్లింపుల్లో మెలకువ వహించండి. వ్యవహారాలతో తీరిక ఉండదు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నిపుణులను సంప్రదించటం శ్రేయస్కరం. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు అనుకూలిస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఆత్మీయులతో తరచు కాలక్షేపం చేస్తుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వివాహయత్నం ఫలించే సూచనలున్నాయి. నిశ్చితార్థంలో మెలకువ వహించండి. స్తోమతకు మించి హామీలివ్వవద్దు. సంతానం అత్యుత్సాహం అదుపు చేయండి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. సాఫ్ట్వేర్ ఉద్యోగుల సదవకాశాలు లభిస్తాయి.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఈ మాసం ద్వితీయార్ధం అనుకూలం. కార్యసిద్ధి, వ్యవహారజయం పొందుతారు. గత కొంతకాలంగా వేధిస్తున్న సమస్యలు తొలగుతాయి. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు భారమనిపించవు. శుభలేఖ అందుకుంటారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. కొత్త యత్నాలు చేపడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. అపోహలకు గురికావద్దు. అర్ధాంతంగా ముగించిన పనులు పూర్తి చేస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అయిన వారితో సంభాషిస్తారు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ముఖ్యం, ఉద్యోగస్తుల కార్యక్రమాలు యధావిధిగా సాగుతాయి. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు గడిస్తారు. సంస్థల స్థాపనలకు అనుకూలం.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఈ మాసం యోగదాయకమే. కొత్త యత్నాలు చేపడతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. మీ మాటకు సర్వత్రా ఆమోదం లభిస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు. పనులు సానుకూలమవుతాయి. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. హామీలు, మధ్యవర్తిత్వాలు తగవు, మీ అయిష్టతను లౌక్యంగా వ్యక్తం చేయండి. దూరపు బంధువుల శుభలేఖ ఆశ్చర్యం కలిగిస్తుంది. మీ శ్రీమతితో సంప్రదింపులు జరుపుతారు. పత్రాల్లో సవరణలు అనివార్యం, సంస్థల స్థాపనలకు రుణాలు మంజూరవుతాయి, ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగస్తులకు పదవీయోగం. అధికారులకు స్థానచలనం. దైవదీక్షలు స్వీకరిస్తారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఆర్ధికంగా బాగుంటుంది. ఖర్చులు అధికం. వాహనం కొనుగోలు చేస్తారు. మీ ఉన్నతి కొందరికి అసూయ కలిగిస్తుంది. చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దు. కొత్తపనులు చేపడతారు. పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. ఆహ్వానం అందుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. తరుచు సన్నిహితులతో సంభాషిస్తుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సోదరులను సంప్రదిస్తారు. ఎదుటివారి అభిప్రాయాలకు ప్రాధాన్యమివ్వండి. అనాలోచితంగా వ్యవహరించవద్దు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. ఉపాధ్యాయులకు అదనపు బాధ్యతలు, ప్రేమవ్యవహారం వివాదాస్పదమవుతుంది.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాఠం
సంప్రదింపులు ఫలిస్తాయి. రావలసిన ధనం అందుతుంది. రుణవిముక్తులవుతారు. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులు, కన్సల్టెన్సీలను ఆశ్రయించవద్దు. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు జరుగుతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. పరిచయాలు బలపడతాయి. హామీలిచ్చే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మీ ఇబ్బందులను లౌక్యంగా తెలియజేయండి. ఎవరినీ నొప్పించవద్దు. కీలక పత్రాలు అందుకుంటారు. సంతానం దూకుడు వివాదాస్పదమవుతుంది. పెద్దల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది. ఆరోగ్యం సంతృప్తికరం. వృత్తి వ్యాపారాల్లో అనుకూల ఫలితాలున్నాయి. ఉద్యోగస్తులకు యూనియన్ కార్యకలాపాలతో తీరిక ఉండదు. ప్రైవేట్ సంస్థ ఉద్యోగస్తులకు పనిభారం.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
అన్ని రంగాల వారికీ యోగదాయకమే. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. లక్ష్యానికి చేరువవుతారు. సహాయ సహకారాలు ఆశించవద్దు. మీ సొంత కృషితోనే అనుకున్నది సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. వాహనం, గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఆహ్వానం అందుకుంటారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. దాంపత్య సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ఆశావహదృక్పథంతో ఇంటర్వ్యూలకు హాజరుకండి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరువ్యాపారాలు బాగుంటాయి. సరుకు నిల్వలో జాగ్రత్త.
ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఈ మాసం ప్రథమార్ధం కంటే ద్వితీయార్ధం అనుకూలం. పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. లక్ష్యసాధన దిశగా అడుగులు ముందుకేస్తారు. యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. దుబారా ఖర్చులు విపరీతం. చెల్లింపుల్లో జాప్యం తగదు. పనుల సానుకూలతకు మరింతగా శ్రమించాలి. హామీలు, మధ్యవర్తిత్వాలు తగవు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. అవతలి వారి స్తోమతను క్షుణ్ణంగా తెలుసుకోండి. తొందరపడి మాట ఇవ్వవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. వైద్యపరీక్షలు అవసరమవుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ముఖ్యం. అసాంఘిక కార్యకలాపాల జోలికిపోవద్దు.'
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
లావాదేవీలతో తీరిక ఉండదు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. గుట్టుగా మెలగండి. కొత్తవ్యక్తులతో జాగ్రత్త. ఆర్ధిక వివరాలు వెల్లడించవద్దు. దుబారా ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. భార్యాభర్తల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి, ఏకపక్షంగా వ్యవహరించవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. ఆప్రియమైన వార్త వినవలసి వస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఉపాధ్యాయులకు కొత్త సమస్య ఎదురవుతుంది. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిరువ్యాపారులకు ఆశాజనకం, ఆకస్మిక ప్రయాణం తలపెడతారు.

