1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. మాసఫలం
  4. September 2026 Horoscope: Monthly Predictions for All 12 Zodiac Signs

01-09-2026 నుంచి 30-09-2026 వరకు సెప్టెంబర్ మాస ఫలితాలు

September 2026 Horoscope
September 2026 Horoscope
మేషం: అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. ఆదాయానికి తగ్గట్టుగా లెక్క చేసుకుంటారు. అంతా అనుకూలంగా ఫలిస్తుంది. ఖర్చులు అధికమైనా ప్రయోజనకరంగా ఉంటాయి. దైవకార్యాలకు వ్యయం చేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు అనుకూలమవుతాయి. అపరిచితులతో మితంగా మెలగండి. మీ మంచి కోసం విషయ సేకరణకు కొంత యత్నిస్తారు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. తరచు ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. సంతానానికి శుభఫలితాలున్నాయి. ఆరోగ్యం బాగుంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులు, కన్సల్టెన్సీలను ఆశ్రయించవద్దు. నోటీసులు అందుకుంటారు. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. గృహ నిర్మాణం పూర్తి కావస్తుంది. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉపాధ్యాయులకు పురస్కార యోగం.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
ఈ మాసం అన్ని విధాలా యోగదాయకం. దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తులవుతారు. స్థిరాస్తి, ధనం అందుతుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు ఉంటాయి. పొదుపునకు అవకాశం లేదు. కొత్త పనులు చేపడతారు. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. వ్యవహారాల్లో సముచిత నిర్ణయం తీసుకుంటారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆలోచింపజేస్తుంది. ఆత్మీయులను సంప్రదించండి. వివాహాది శుభ నిర్ణయాలకు అనుకూలం. పథకాల్లో సవరణలు అనుకూలిస్తాయి. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. ప్రముఖులకు సన్నిహితులవుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అటుపోట్లను తట్టుకుంటారు. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, అధికారులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు.
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సంప్రదింపులు ఫలిస్తాయి. రావలసిన ధనం అందుతుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు ఉంటాయి. అర్హులకు సాయం చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. ప్లాన్‌లో సవరణలు సాధ్యమవుతాయి. సన్నిహితులతో నిత్యం సంభాషిస్తారు. సంస్థల స్థాపనకు అనుకూలం. బ్యాంకు పనులు పూర్తవుతాయి. వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తి చేస్తారు. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. మీ సలహా ఉభయులకూ ఆమోదయోగ్యమవుతుంది. ఆశావహ దృక్పథంతో ఉద్యోగ యత్నం సాగించండి. మీ ప్రయత్నం త్వరలో ఫలిస్తుంది. వ్యాపారాల అభివృద్ధికి పథకాలు చేపడతారు. వృత్తి, ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. పెట్టుబడులపై దృష్టి పెడతారు. రుణ విషయాల్లో జాగ్రత్త. ఏకాగ్రతతో వ్యవహరించండి.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. యత్నాలను సన్నిహితులు ప్రోత్సహిస్తారు. ఆదాయానికి తగ్గట్టుగా బడ్జెట్ చేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. పనులు చురుకుగా సాగుతాయి. అందరితోనూ మితంగా సంభాషించండి. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన వద్దు. భార్యాభర్తల మధ్య అవగాహన నెలకొంటుంది. బంధువుల రాకపోకలు ప్రారంభమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త. క్రమం తప్పకుండా ఔషధ సేవనం పాటించండి. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. ప్రైవేటు ఉద్యోగులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాల్లో నష్టాలను సమీక్షించుకుంటారు. చిన్న వ్యాపారాలు ఊపందుకుంటాయి. దైవదర్శనాలు ఉల్లాసం కలిగిస్తాయి. ప్రయాణం సజావుగా సాగుతుంది.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఈ మాసం ప్రథమార్థం ఏమంత అనుకూలం కాదు. సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. ఖర్చులు విపరీతం, రుణాలు చేయాల్సి వస్తుంది. చేసిన పనులే మళ్లీ చేయవలసి వస్తుంది. ప్రతి విషయంలోనూ ఓర్పుతో శ్రమించాలి. స్వయం కృషి ఫలితాన్నిస్తుంది. కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. కొత్త యత్నాలు చేపడతారు. మీ జీవిత భాగస్వామి ప్రోత్సాహం ఉంటుంది. తెగిపోయిన బంధువులు బలపడతారు. ప్రతి విషయంలోనూ ధైర్యంగా ముందుకు సాగండి. విమర్శించిన వారే మీ సమర్థతను గుర్తిస్తారు. లక్ష్యం నెరవేరుతుంది. ఆరోగ్యం సంతృప్తికరం. ధార్మిక విషయాల పట్ల ఆసక్తి పెంపొందుతుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. అటుపోట్లకు దీటుగా స్పందిస్తారు. పెట్టుబడులకు తరుణం కాదు. ఉద్యోగస్తులకు పదోన్నతి, ఉపాధ్యాయులకు పురస్కార యోగం. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కార్యసిద్ధికి మరింత శ్రమించాలి. మీ కష్టం వృధా కాదు. పురోగతి లేదని నిరుత్సాహానికి లోనవుతారు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఏ విషయంపైనా ఆసక్తి ఉండదు. ఆదాయానికి మించి ఖర్చు చేయాల్సి వస్తుంది. పొదుపు ధనం ముందుగానే పొందుతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు ఆలస్యమవుతాయి. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో పరిస్థితులు మెరుగుపడతాయి. ఓర్పుతో యత్నాలు సాగించండి. కనిపించకుండా పోయిన వస్తువులు లభిస్తాయి. భార్యాభర్తలు పరస్పర అవగాహనతో మెలగాలి. సంతానానికి శుభఫలితాలున్నాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారుల తీరును గమనించి మెలగండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉపాధి పథకాలు చేపడతారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం తగదు.
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ప్రతికూలతలు అధికం. ఆలోచనలతో సతమతమవుతారు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఏ విషయంపైనా ఆసక్తి ఉండదు. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. చెల్లింపుల్లో జాప్యం తగదు. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో పరిస్థితులు చక్కబడతాయి. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. వ్యాపకాలు సృష్టించుకోవడం ఉత్తమం. వీలైనంత వరకు మనసుకు నచ్చిన వారితో కాలక్షేపం చేయండి. మీ శ్రీమతి ధోరణిలో మార్పు వస్తుంది. ఆప్తులు మీ ఆంతర్యాన్ని అర్థం చేసుకుంటారు. సంతానానికి శుభఫలితాలు ఉన్నాయి. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి ప్రత్యేక పథకాలు రూపొందిస్తారు. వ్యాపారాల విస్తరణకు తరుణం కాదు.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదములు
మీ పని రంగంలో పురోభివృద్ధి చెందుతారు, అనుభవం గడిస్తారు. మీ మాట నేరుగా చెల్లుబాటవుతుంది. తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు ప్రయోజనకరం. ఆలయాలు, సేవా సంస్థలకు విరాళాలు అందిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు అనుకూలమవుతాయి. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. పోయాయనుకున్న వస్తువులు లభిస్తాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. అవతలి వారి తాహతును క్షుణ్ణంగా తెలుసుకోండి. భేషజాలకు పోవద్దు. వస్త్ర, ఫ్యాన్సీ, కిరాణా వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు.
 
ధనస్సు: మూల, పూర్వాషాడ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఈ మాసం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ ధైర్యంగా ఉంటారు. వ్యవహారాల్లో నిలదొక్కుకుంటారు. ఒప్పందాల్లో సముచిత నిర్ణయం తీసుకుంటారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. కార్యసిద్ధికి మరింత శ్రమించాలి. పనులు, బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. పథకాల్లో సవరణలు అనుకూలిస్తాయి. వివాహ యత్నం ఫలిస్తుంది. వేడుకలకు హాజరవుతారు. గృహ మార్పు అనివార్యం. తరచు ఆత్మీయులతో సంభాషిస్తారు. స్నేహ సంబంధాలు బలపడతాయి. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటుపోట్లను తట్టుకుంటారు. వృత్తి, ఉపాధి పథకాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి.
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
మీ ఓర్పు, నేర్పులకు పరీక్షా సమయం. ఆచితూచి అడుగు ముందుకు వేయండి. తొందరపాటు చర్యలు తగవు. అందరితోనూ మితంగా సంభాషించండి. ఎవరినీ తక్కువ అంచనా వేయవద్దు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు ఉంటాయి. పొదుపునకు అవకాశం లేదు. దూరపు బంధువులను కలుసుకుంటారు. భార్యాభర్తల మధ్య అవగాహన నెలకొంటుంది. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. హామీలు, మధ్యవర్తిత్వాలు తగవు. సంతోషం, ఉత్సాహాన్ని అదుపు చేయండి. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. పనులు ముగింపు దశలో హడావుడిగా ఉంటాయి. మీపై ఇతరుల ప్రభావం అధికం. ఉపాధ్యాయులు పురస్కారం అందుకుంటారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉమ్మడి కంటే సొంత వ్యాపారాలే కలిసి వస్తాయి.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు
ఈ మాసం ప్రతికూలతలు అధికం. వ్యవహారాల్లో తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. నిపుణుల సలహా పాటించండి. పనులు పూర్తి కావస్తున్న సమయంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆదాయం అంతంత మాత్రమే. పురోభివృద్ధి లేక నిస్తేజానికి లోనవుతారు. అపరిచితుల విషయాలకు దూరంగా ఉండండి. ఏ విషయాన్ని తీవ్రంగా పరిగణించవద్దు. ఆత్మీయులతో సంభాషణ ఊరటనిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. కలిసి వచ్చిన అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. అనుమానాలు, అపోహలకు తావివ్వద్దు. సంతానం ఉద్యోగ యత్నం ఫలిస్తుంది. మానసికంగా కుదుటపడతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉపాధి పథకాలు చేపడతారు. ఉపాధ్యాయులకు శ్రమకు తగిన గుర్తింపు ఉండదు. శుభకార్యంలో పాల్గొంటారు.
 
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
కార్యసిద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఒత్తిడి, పనిభారం, అకాల భోజనం ఉంటుంది. ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ఖర్చులు అధికమైనా సంతృప్తికరం. కొత్త పనులు చేపడతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సభ్యత్వం స్వీకరిస్తారు. బాధ్యతగా మెలగాలి. మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ కనబరుస్తారు. కనిపించకుండా పోయిన పత్రాలు లభిస్తాయి. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. ఉపాధ్యాయులు పురస్కారాలు అందుకుంటారు. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. చిరు వ్యాపారులకు ఆశాజనకం. వృత్తి, ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు.
About Writer
పి.ప్రసూనా రామన్
తర్వాతి కథనం
కోడమూరు శ్రీ వేంకటేశ్వర స్వామికి తేళ్లను సమర్పిస్తున్న భక్తులు.. అలా చేస్తే?