22-02-2026 నుంచి 28-02-2026 వరకు మీ వార రాశి ఫలితాలు
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. ఊహలు, అంచనాలు ఫలిస్తాయి. ఖర్చులు సామాన్యం. పెట్టుబడులపై దృష్టిపెడతారు. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. కొంతమొత్తం సాయం అందించండి. మంగళవారం నాడు ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. మీ నుంచి విషయాలు రాబట్టేందుకు కొందరు యత్నిస్తారు. ఆర్ధిక వివరాలు గోప్యంగా ఉంచండి. ప్రకటనలు, ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. వివాహయత్నం ఫలించే సూచనలున్నాయి. మీ అభిప్రాయాలను పెద్దల ద్వారా తెలియజేయండి. వ్యాపారాభివృద్ధికి పథకాలు అమలు చేస్తారు. ఉపాధ్యాయుల కృషి ఫలిస్తుంది. ప్రముఖుల ప్రశంసలందుకుంటారు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. దూరప్రయాణంలో జాగ్రత్త.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కార్యసాధనకు మరింత శ్రమించాలి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. యత్నాలు విరమించుకోవద్దు. స్థిరాస్తి ధనం అందుతుంది. కొంతమొత్తం పొదుపు చేస్తారు. శనివారం నాడు పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. మొండిధైర్యంతో ముందుకు సాగుతారు. దూరపు బంధువులతో సంభాషిస్తారు. స్నేహసంబంధాలు బలపడతాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. కావలసిన వస్తువులు సమయానికి కనిపించవు. చీటికి మాటికి అసహనం చెందుతారు. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. ఉద్యోగ బాధ్యతలపై శ్రద్ధ వహించండి. అధికారులకు హోదామార్పు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. సేవ, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
అన్నింటా మీదే పై చేయి. ముఖ్యమైన అంశాలపై పట్టు సాధిస్తారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. గురువారం నాడు పనులు హడావుడిగా సాగుతాయి. ప్రముఖులతో సంభాషిస్తారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. అందరితో కలుపుగోలుగా మెలుగుతారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. మీ సాయంతో ఒకరికి లబ్ధి చేకూరుతుంది. బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులు, కన్సల్టెన్సీలను ఆశ్రయించవద్దు. సన్నిహితులు ఇచ్చిన సమాచారం ఆలోచింపచేస్తుంది. పెద్దలను సంప్రదిస్తారు. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉపాధ్యాయులకు పురస్కారయోగం.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
గ్రహసంచారం అనుకూలంగా ఉంది. ఏ పని తలపెట్టినా విజయవంతమవుతుంది. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. అయిన వారు ప్రోత్సాహం అందిస్తారు. ఖర్చులు అధికం. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. మీ అలక్ష్యం వల్ల ఇబ్బందులెదుర్కోవలసి వస్తుంది. ఆదివారం నాడు ముఖ్యులను కలిసినా ప్రయోజనం ఉండదు. మొండిధైర్యంతో ముందుకు సాగుతారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ వహిస్తారు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. ఉద్యోగ బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. ప్రముఖులకు ఘనస్వాగతం, ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. వ్యూహాత్మకంగా అడుగు ముందుకేస్తారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. ఆదాయం బాగుంటుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పనులు సానుకూలతకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. గురువారం నాడు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఎవరినీ అతిగా నమ్మవద్దు. ముఖ్యమైన బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఆర్ధిక వివరాలు గోప్యంగా ఉంచండి. వాహనం, విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. సంతానానికి శుభఫలితాలున్నాయి. ఆందోళన కలిగించిన సమస్య పరిష్కారమవుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఉద్యోగ బాధ్యతలపై దృష్టి పెట్టండి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
మీదైన రంగంలో నిలదొక్కుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. మీ పొరపాట్లు సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది. శనివారం నాడు పనులు ఒక పట్టాన సాగవు. ముఖ్యుల సందర్శనం కోసం నిరీక్షణ తప్పదు. చిన్న విషయానికే చికాకుపడతారు. ఓర్పుతో మెలగండి. నగదు, ఆభరణాలు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో అనుకూలత పరిస్థితులు నెలకొంటాయి. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. చిట్స్, ప్రైవేట్ సంస్థల్లో మదుపు శ్రేయస్కరం కాదు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. అవివాహితులకు శుభసూచకం. ఆశించిన సంబంధం కుదిరే అవకాశాలున్నాయి. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. న్యాయ, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కార్యసాధనకు ఓర్పు ముఖ్యం. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. బంధుమిత్రులతో విభేదాలు తలెత్తుతాయి. ఎవరినీ నిందించవద్దు. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయండి. మీ తప్పులు సరిదిద్దుకోవటం ముఖ్యం. సోమవారం నాడు పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. పెట్టుబడుల నిర్ణయం పునఃపరిశీలించుకోండి. ఏ విషయాన్నీ తేలికగా కొట్టివేయొద్దు. పెద్దల సలహా పాటించండి. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. వ్యాపారాలు నిదానంగా ఊపందుకుంటాయి. ప్రస్తుత వ్యాపారాలే కొనసాగించండి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. వాహనదారులకు అత్యుత్సాహం తగదు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
వ్యవహారానుకూలత ఉంది. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపు చేయాలన్న ఆలోచన ఫలించదు. మంగళవారం నాడు అవగాహన లేని విషయాల జోలికి పోవద్దు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. వివాహయత్నం ఫలించే సూచనలున్నాయి. సంతానం కదలికలపై కన్నేసి ఉంచండి. ఆరోగ్యం జాగ్రత్త. ఆహార నియమాలు క్రమం తప్పకుండా పాటించండి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఒక సంఘటన మీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నిపుణులతో సంప్రదింపులు జరుపుతారు. ఉపాధి పథకాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. వ్యాపారాలు నిదానంగా ఊపందుకుంటాయి. ఉద్యోగ బాధ్యతల్లో మెళకువ వహించండి. అధికారులకు హోదామార్పు. జూదాలు, బెట్టింగ్ల జోలికి పోవద్దు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
లావాదేవీలతో తీరిక ఉండదు. పనిభారం, విశ్రాంతి లోపం. కొత్తయత్నాలు చేపడతారు. కలిసివచ్చిన అవకాశాన్ని తక్షణం అందిపుచ్చుకోండి. భేషజాలు, పట్టుదలకు పోవద్దు. గురువారం నాడు అప్రమత్తంగా ఉండాలి. మీ విషయాల్లో ఇతరుల ప్రమేయతనికి తావివ్వవద్దు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. మొండిధైర్యంతో ముందుకు సాగుతారు. స్థిరాస్తి ధనం అందుతుంది. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. మీ సిఫార్సుతో ఒకరికి ఉద్యోగావకాశం లభిస్తుంది. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. కిట్టని వ్యక్తులు తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. నూతన వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఈ వారం అనుకూలదాయకం. సన్నిహితులు సాయం అందిస్తారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. లక్ష్యానికి చేరువవుతారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. వీలైతే కొంతమొత్తం సాయం అందించండి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. పన్ను చెల్లింపుల్లో జాప్యం తగదు. మీ అలక్ష్యం ఇబ్బంది కలిగిస్తుంది. ముఖ్యమైన బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. అజ్ఞాతవ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. మీ సందేహాలను సన్నిహితులకు తెలియజేయండి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు. వ్యాపారాల్లో ఒడిడుకులను దీటుగా ఎదుర్కుంటారు. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ప్రయాణం ఉల్లాసంగా సాగుతుంది.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
వ్యవహారం కొలిక్కివస్తుంది. స్థిమితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పనులు సకాంలో పూర్తి చేస్తారు. కొన్ని అవకాశాలు యాదృచ్ఛికంగా కలిసివస్తాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. ఆదాయం బాగుంటుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. ఉత్సాహంగా యత్నాలు సాగిస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యం పొందుతారు. సంతానం మొండితనం అసహనం కలిగిస్తుంది. వారితో అనునయంగా మెలగండి. ప్రైవేట్ ఉద్యోగస్తులకు మార్పులు అనివార్యం. ఉద్యోగస్తుల పదోన్నతికి అధికారులు సిఫార్సు చేస్తారు. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. న్యాయవాదులకు ఆదాయాభివృద్ధి. సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొంటారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆశావహదృక్పధంతో మెలగండి. ఏ విషయానికీ అధైర్యపడవద్దు. పరిస్థితులు త్వరలో చక్కబడతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. బుధవారం నాడు పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది. సాయం అర్ధించేందుకు మనస్కరించదు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. కష్టసమయంలో సన్నిహితులు ఆదుకుంటారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. అయిన వారు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు. పత్రాల్లో సవరణలు అనివార్యం. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. కొత్తయత్నాలకు శ్రీకారం చుడతారు. సంతానానికి మంచి పరిణామాలున్నాయి. ఉద్యోగ బాధ్యతల్లో అశ్రద్ధ తగదు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉపాధి పథకాల్లో పురోభివృద్ధి, అనుభవం గడిస్తారు.
