1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
  4. May 24 to May 30, 2026 -Vara Phalalu 24th May - 30th May 2026, Weekly Horoscope, Pisces, Weekly Horoscope,

24-05-2026 నుంచి 30-05-2026 వరకు ఫలితాలు - రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు

Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యానుకూలతకు మరింత శ్రమించాలి. ఓర్పుతో మెలగండి. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. నేడు అనుకూలించనిది. రేపు ఫలిస్తుంది. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. చేబదుళ్లు స్వీకరించాల్సి వస్తుంది. బుధవారం నాడు చేపట్టిన పనులు ముందుకు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. దంపతుల మధ్య స్వల్ప కలహం బంధువర్గాలతో విభేదిస్తారు. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. పోయాయనుకున్న వస్తువులు లభ్యమవుతాయి. సంతానం చదువులపై దృష్టి పెడతారు. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు, వ్యాపారాభివృద్ధికి పథకాలు చేపడతారు. సరుకు నిల్వల్లో జాగ్రత్త. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతిలోపం. ఆశావహదృక్పథంతో ఇంటర్వ్యూలకు హాజరుకండి. ఆత్మీయులతో సంభాషిస్తారు. వివాదాలు పరిష్కారమవుతాయి. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు. అన్యమనస్కంగా గడుపుతారు. ముఖ్యుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పువు. మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. అనుకోని ఖర్చు ఎదురవుతుంది. సాయం అర్ధించేందుకు మనస్కరించదు. అవసరాలు వాయిదా పడతాయి. శుక్రవారం నాడు అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. వివాదాల్లో మీ ప్రమేయం లేకుండా చూసుకోండి. సన్నిహితులతో సంభాషణ ఉత్సాహపరుస్తుంది. ధైర్యంగా యత్నాలు సాగిస్తారు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. నోటీసులు అందుకుంటారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలను కచ్చితంగా తెలియజేయండి. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులు బాధ్యతగా ఉంచాలి. ప్రలోభాలకు లొంగవద్దు, వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు
పెద్దల వ్యాఖ్యలు ఉత్సాహపరుస్తాయి. కొత్త యత్నాలకు అనుకూలం. కలిసివచ్చిన అవకాశాన్ని తక్షణం అంది పుచ్చుకోండి. అనుమానాలు అపోహలకు గురికావద్దు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఇంటి విషయాలపై దృష్టిపెడతారు. శనివారం నాడు కావలసిన పత్రాలు కనిపించవు. చిన్న విషయానికి చికాకుపడుతారు. సంతోషం కలిగిస్తుంది. సంతానానికి శుభయోగం. ఒక సమస్య సానుకూలమవుతుంది. ఖర్చులు విపరీతం, నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త. పనులు, బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు, సంతానం, అత్యుత్సాహం చికాకు కల్పిస్తుంది. ఉపాధి పథకాలు చేపడతారు. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ది ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. ఒప్పందాలు కుదుర్చుకుంటారు. 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యక్రమాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. లక్ష్యానికి చేరువవుతారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఉత్సాహంగా అడుగు ముందుచేస్తారు. అవకాశాలను అందిపుచ్చుకోండి. అపోహలకు తావివ్వకండి. ఒత్తిడిని పెరగకుండా చూసుకోండి. సోమవారం నాడు పనులు ఒక పట్టాన సాగవు. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. ఆశావహదృక్పథంతో మెలగండి. ఆదాయం బాగుంటుంది. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. పోటీ పరీక్షల్లో సంతానం మంచి ర్యాంకులు సాధిస్తుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. వాహనం, విలువైన వస్తువులు జాగ్రత్త. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
లావాదేవీలు కొలిక్కివస్తాయి. రావలసిన ధనం అందుతుంది. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. రోజు వారీ ఖర్చులే ఉంటాయి. ఆప్తులకు సాయం అందిస్తారు. సంస్థల స్థాపనలకు అనుకూలం. ఆదివారం నాడు పనులు మందకొడిగా సాగుతాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. అహ్వానం, కీలక పత్రాలు అందుకుంటారు. అవివాహితులకు శుభవార్తా శ్రవణం. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ప్రముఖులను ఆకట్టుకుంటారు. వ్యతిరేకులతో జాగ్రత్త. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తులకు పదవీయోగం. బాధ్యతల మార్పు. సాహసకృత్యాలకు పాల్పడవద్దు.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. పట్టుదలతో యత్నాలు సాగించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఎదుటివారి తీరును గమనించి మెలగండి. మంగళవారం నాడు ఊహించని ఖర్చు తగులుతుంది. ధనసహాయం అర్ధించేందుకు మనస్కరించదు. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. మీ ఇష్టాయిష్టాలను స్పష్టంగా తెలియజేయండి. పరీక్షల్లో సంతానం సామాన్య ఫలితాలే సాధిస్తారు. ఉద్యోగ బాధ్యతలపై దృష్టిపెట్టండి. అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారాలే కలిసివస్తాయి. సన్మాన, సంస్కరణ సభల్లో పాల్గొంటారు.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 3 పాదాలు
అన్ని రంగాల వారికీ బాగుంటుంది. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాలు. లక్ష్యానికి చేరువవుతారు. నూతన పరిచయాలు బలపడతాయి. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. బుధవారం నాడు పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ప్రముఖులను కలుసుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. కొంతమొత్తం ధనం అందుతుంది. పెట్టుబడులపై దృష్టిపెడతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. మీ అభిప్రాయాలను సున్నితంగా తెలియజేయండి. సంతానం ఉన్నత విద్యాయత్నం ఫలిస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. మీ ఇష్టాయిష్టాలను స్పష్టంగా తెలియజేయండి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. ఉద్యోగ విధుల పట్ల శ్రద్ద వహించండి. ఆరోగ్యం సంతృప్తికరం. ప్రమాణం సజావుగా సాగుతుంది. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ 1,2,3,4 పాదములు
సంప్రదింపులతో తీరిక ఉండదు. అకాలభోజనం, విశ్రాంతి లోపం. ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. నిపుణుల సలహా పాటించండి. పొదుపుమూలక ధనం అందుకుంటారు. ఖర్చులు సామాన్యం, ధన సహాయం తగదు. ఆప్తులతో తరచు సంభావిస్తుంటారు. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. కుటుంబ సౌఖ్యం, వాహనయోగం పొందుతారు. సంతానానికి శుభపరిణామాలున్నాయి. పొదుపుమూలక ధనం అందుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. ఉద్యోగస్తులు అప్రమత్తంగా. ఉండాలి. ఒత్తిళ్లు, ధనప్రలోభాలకు లొంగవద్దు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1,2, 3,4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదం
ఈ వారం ప్రశాంతంగా గడుస్తుంది. రావలసిన ధనం అందుతుంది. కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. మానసికంగా స్థిమితపడతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. కొత్త పనులు చేపడతారు. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. ఆహ్వానం అందుకుంటారు. పత్రాల్లో సవరణలు సాధ్యపడతాయి. ఇంటి విషయాలపై దృష్టి సారిస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. మీ జోక్యం అనివార్యం. ఉభయులకూ మీ సలహా ఆమోదయోగ్యమవుతుంది. సంతానానికి ఉన్నత విద్యాయత్నం ఫలిస్తుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను తట్టుకుంటారు. ఉద్యోగ విధులను సమర్థంగా నిర్వహిస్తారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. అనుభవజ్ఞులను సంప్రదించటం శ్రేయస్కరం. భేషజాలకు పోవద్దు. ఖర్చులు విపరీతం. వాయిదాలు చెల్లింపుల్లో జాప్యం తగదు. అనుకున్న పనులు తేలికగా ముగిస్తాయి. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనాన్నిస్తుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. మీ కలుపుగోలుతనం అందరినీ ఆకట్టుకుంటుంది. కుటుంబసౌఖ్యం పొందుతారు. వివాహయత్నాలు ఫలిస్తుంది. నిశ్చితార్థంలో మెలకువ వహించండి. తాహతుకు మించి హామీలివ్చవద్దు. సంతానం పై చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. శనివారం నాడు ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. వృత్తి వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. ఉపాధ్యాయులు పదోన్నతితో కూడిన బదిలీ, ఆధ్యాత్మికత పెంపొందుతుంది. మొక్కులు తీర్చుకుంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు
వస్త్రప్రాప్తి, వస్తులాభం ఉన్నాయి. కష్టానికి తగిన ప్రతిఫలం అందుకుంటారు. పనులు త్వరితగతిన సాగుతాయి.  ఆదాయం బాగుంటుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఆపన్నులకు సాయం అందిస్తారు. స్నేహసంబంధాలు బలపడతాయి. సోమవారం నాడు ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. అజ్ఞాతవ్యక్తులు మోసగించేందుకు యత్నిస్తారు. మీ సమస్యలను సన్నిహితులకు తెలియజేయండి. అవివాహితులకు శుభయోగం. తరచు ఆప్తులతో సంభాషిస్తుంటారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. కొత్త వ్యాపారాలపై దృష్టిపెడతారు.. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. విందులు, వేడుకలకు హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వడిచి వెళ్లకండి.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆర్ధికంగా నిలదొక్కుకుంటారు. రుణసమస్య తొలుగుతుంది. మానసికంగా స్థిమితపడతారు. పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. చేపట్టిన అనుకున్న విధంగా పూర్తవుతాయి. ఆప్తుల ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. అయిన వారితో కాలక్షేపం చేస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. బుధవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. ఇతరులు విషయాల్లో జోక్యం తగదు. అందరితోను మితంగా సంభాషించండి. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. క్రమం తప్పకుండా ఔషధసేవనం పాటించండి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు ఉల్లాసం కలిగిస్తాయి. ఓర్పుతో ఉద్యోగ యత్నం సాగించండి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగులకు ధన్యప్రలోభం తగదు. అధికారులకు హోదా మార్పు విద్యార్థులు నుంచి ర్యాంకులు సాధిస్తారు.
About Writer
పి.ప్రసూనా రామన్