మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
తలపెట్టన కార్యం సఫలమవుతుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. రావలిసిన ధనం అందుతుంది. ఖర్చులు అధికం. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. సోమవారం నాడు పనులు మందకొడిగా సాగుతాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. దూరపు బంధువుల ఆహ్వానం అందుకుంటారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ఉల్లాసంగా గడుపుతారు. చిన్ననాటి పరిచయస్తుల కలయిక అనుభూతి కలిగిస్తుంది. పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. మీ అలక్ష్యం ఇబ్బంది కలిగిస్తుంది. అనవసర జోక్యం తగదు. మీ వ్యక్తిత్వానికి భంగం కలుగకుండా మెలగండి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. శుభకార్యానికి హాజరవుతారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఒత్తిడి, చికాకులు అధికం. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. మీ తప్పిదాలు సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. పొదుపు పథకాలపై దృష్టిపెడతారు. ఏజెన్సీలు, చిట్స్ జోలికి పోవద్దు. నమ్మకస్తులే మోసగించేందుకు యత్నిస్తారు. బుధవారం నాడు ప్రముఖులను కలిసినా ఫలితం ఉండదు. పనులు, కార్యక్రమాలు వాయిదా పడతాయి. అవివాహితులు శుభవార్త వింటారు. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. నూతన వ్యాపారాలు చేపడతారు. ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉపాధ్యాయులకు ఒత్తిడి. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. అనాలోచిత నిర్ణయం తగదు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. పట్టింపులు, భేషజాలకుర పోవద్దు. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. పెద్దమొత్తం చెల్లింపుల్లో జాగ్రత్త. ఆటంకాలెదురైనా పనులు పూర్తి చేయగల్గుతారు. మంగళవారం నాడు కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఉత్సాహం కలిగిస్తుంది. ధైర్యంగా ముందుకు సాగుతారు. పరిచయస్తుల రాకపోకలు అధికమవుతాయి. గృహంలో స్తబ్ధత తొలగుతుంది. ఉద్యోగస్తులకు యూనియన్లో గుర్తింపు లభిస్తుంది. న్యాయ, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. భూ సంబంధిత వివాదాలు పరిష్కారమవుతాయి.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అనుకూలతలు ఉన్నాయి. తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. రుణవిముక్తులై తాకట్టు విడిపించుకుంటారు. ఖర్చులు భారమనిపించవు. ఉల్లాసంగా గడుపుతారు. పనులు వేగవంతమవుతాయి. ఆదివారం నాడు ప్రముఖుల సందర్శనం వీలుపడదు. మొండిధైర్యంతో కార్యక్రమలు సాగిస్తారు. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. వీలైతే కొంతమొత్తం సాయం అందించండి. వివాహయత్నం ఫలించే సూచనలున్నాయి. నిశ్చితార్ధంలో జాగ్రత్త. తాహతకు మించి హామీలివ్వవద్దు. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. మీ శ్రీమతి సలహా పాటిచండి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. దస్త్రం వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగ బాధ్యతల్లో పొరపాట్లను సరిదిద్దుకుంటారు. సన్మాన, సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొంటారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
లావాదేవీలతో తీరిక ఉండదు. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఒత్తిడికి గురికాకండి. స్థిమితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. సన్నిహితులను సంప్రదించటం శ్రేయస్కరం. పనులు ఒక పట్టాన సాగవు. చీటికిమాటికి అసహనం చెందుతారు. దంపతుల మధ్య అకారణ కలహం. ఆప్తుల రాకతో కుదుటపడతారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. స్థిరాస్తి ధనం అందుతుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. శుక్రవారం నాడు నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. అపరిచితులను ఓ కంట కనిపెట్టండి. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఓర్పు ముఖ్యం. వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. నూతన పెట్టుబడులు కలిసిరావు. నిరుత్సాహం వీడి ఇంటర్వ్యూలకు హాజరుకండి. ఒక సమస్య మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఈ వారం ఆశాజనకం. మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. పనులు త్వరితగతిన సాగుతాయి. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. పెద్దమొత్తం చెల్లింపుల్లో జాగ్రత్త. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. ప్రలోభాలకు గురికావద్దు. అనుభవజ్ఞులను సంప్రదించండి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. ముఖ్యమైన పత్రాలు, వస్తువులు జాగ్రత్త. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. అధికారులకు హోదా మార్పు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చిరువ్యాపారులకు పురోభివృద్ధి. ధార్మికత పెంపొందుతుంది. అనుకున్న మొక్కులు తీర్చుకుంటారు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
అన్ని రంగాల వారికీ బాగుంటుంది. ధైర్యంగా ముందుకు పోగలరు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. స్నేహసంబంధాలు బలపడతాయి. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు అదుపులో ఉండవు. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. ఆత్మీయుల ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది, సన్నిహితులతో తరచు సంభాషిస్తుంటారు. అనవసర విషయాల్లో జోక్యం తగదు. ఇతరుల బాధ్యతలు చేపట్టి అవస్థపడతారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. ఉద్యోగస్తులకు పదవీయోగం. అధికారులకు అదనపు బాధ్యతలు. టెక్నికల్ విద్యార్థులకు సదవకాశాలు లభిస్తాయి. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యసాధనకు ఓర్పు, కృషి ప్రధానం. ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. పెద్దఖర్చు తగిలే సూచనలున్నాయి. ధనం మితంగా వ్యయం చేయండి. సోమవారం నాడు అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు అభ్యంతరాలెదురవుతాయి. సంతానం దూకుడు అదుపు చేయండి. ప్రైవేట్ ఉద్యోగస్తులకు క్లిష్టసమయం. వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు తరుణం కాదు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
వేడుకను ఘనంగా చేస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. కానుకలిచ్చిపుచ్చుకుంటారు. మీ ఉన్నతి కొందరికి అపోహ కలిగిస్తుంది. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదుర్కుంటారు. మీపై శకునాల ప్రభావం అధికం. చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దు. ఆదాయం బాగుంటుంది. కొంతమొత్తం పొదుపు చేస్తారు. చెల్లింపుల్లో మెళకువ వహించండి. బుధవారం నాడు ఊహించని సంఘటన ఎదురవుతుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు గడిస్తారు. కొత్త వ్యాపారాలు చేపడతారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. ధైర్యంగా అడుగు మందుకేయండి. మీ కృషి వెంటనే ఫలిస్తుంది. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తిచేస్తారు. కొత్త పరిచయాలు బలపడతాయి. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. స్థిరాస్తి కొనుగోలు చేయాలనే ఆలోచన బలపడుతుంది. గురువారం నాడు అందరితోను మితంగా సంభాషించండి. మీ వ్యాఖ్యలను కొందరు తప్పుపడతారు. పెద్దల చొరవతో వివాదం సద్దుమణుగుతుంది. పత్రాల్లో మార్పుచేర్పులు సాధ్యపడతాయి. ఆరోగ్యం జాగ్రత్త. క్రమం తప్పకుండా ఆహార నియమాలు పాటించండి. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. నూతన పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగస్తులకు పదోన్నతి. ఏకాగ్రతతో వాహనం నడపండి.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆర్ధికలావాదేవీలు ముగుస్తాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు అధికం. సంస్థల స్థాపనలకు అనుమతులు లభిస్తాయి. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఒత్తిళ్లకు గురికావద్దు. శుక్రవారం నాడు ముఖ్యుల సందర్శనం కోసం పడిగాపులు తప్పవు. ఓర్పుతో యత్నాలు సాగించండి. సహాయం ఆశించవద్దు. సంతానం విజయం సంతోషం కలిగిస్తుంది. ఆత్మీయులతో తరుచు సంభాషిస్తుంటారు. గృహమార్పు అనివార్యం. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. ఉద్యోగస్తుల పదోన్నతికి అధికారులు సిఫార్సు చేస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలు, ఆటుపోట్లను దీటుగా ఎదుర్కుంటారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. ఓర్పుతో శ్రమించి లక్ష్యం సాధిస్తారు. సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ధనలాభం, వాహనసౌఖ్యం పొందుతారు. ఖర్చులు అదుపులో ఉండవు. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. ఆదివారం నాడు పనులు మందకొడిగా సాగుతాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆహ్వానం అందుకుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొత్త యత్నాలు మొదలెడతారు. శకునాలు పట్టించుకోవద్దు. మనోధైర్యంతో ముందుకు సాగండి. గృహంలో శుభకార్యం నిశ్చయమవుతుంది. కల్యాణ వేదికలు అన్వేషిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. జూదాలు, బెట్టింగ్ జోలికి పోవద్దు.