Benefits of Honey: తేనెతో బరువు మటాష్.. మహిళలకు దివ్యౌషధం
మహిళలు బరువు తగ్గాలంటే.. తప్పకుండా తేనెను డైట్‌లో చేర్చాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఒక వెల్లుల్లి రెబ్బను రుబ్బి, ఒక టీస్పూన్ తేనెతో కలిపి ఉదయం ఖాళీ కడుపుతో తినడం ద్వారా బరువు సులభంగా తగ్గవచ్చు. కానీ, అధికంగా తీసుకుంటే శరీరానికి కూడా హానికరం కావచ్చు.
తేనె తీసుకోవడం ద్వారా బరువు తగ్గడం చాలా సులభం. గోరువెచ్చని నీరు, నిమ్మకాయ రసాన్ని తీసుకోవడం ద్వారా మహిళలు బరువును సులభంగా తగ్గవచ్చు. శరీరాన్ని డీటాక్స్ చేయడానికి ఒక గొప్ప ఎంపిక. దీని కోసం, ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో సగం నిమ్మకాయను పిండాలి. దానికి 1 టీస్పూన్ తేనె కలపండి.
ఉదయం ఖాళీ కడుపుతో దీన్ని తీసుకోండి. ఇది బేసల్ మెటబాలిక్ రేటును పెంచడానికి, జీర్ణవ్యవస్థను శుభ్రంగా ఉంచడానికి సహాయపడుతుంది. శరీరం రోజంతా శక్తిని పొందటానికి సహాయపడుతుంది.
ఇకపోతే.. దాల్చిన చెక్క చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. తేనె జీవక్రియను పెంచుతుంది. ఒక గ్లాసు నీటిలో అర టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని మరిగించండి. నీరు కొద్దిగా చల్లబడిన తర్వాత, దానికి ఒక టీస్పూన్ తేనె వేసి రాత్రి పడుకునే ముందు లేదా ఉదయం అల్పాహారానికి అరగంట ముందు తీసుకుంటే ఇట్టే బరువు తగ్గుతారు.