నీలగిరి జిల్లా, కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల్లో ఉండే బండిపూర్ పులుల సంరక్షణా కేంద్రం (డీటీఆర్) అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడుతున్న కారణంగా... ఈరోజు నుంచి ఈ కేంద్రం సమీపంలోని నీలగిరి-మైసూర్‌ల మధ్య ఉన్న జాతీయ రహదారి-67పై రాత్రి 10 గంటల తరువాత వాహనాల రాకపోకలను నిషేధిస్తున్నట్లు కర్ణాటకలోని చామరాజ నగర్ జిల్లా కలెక్టర్ ప్రకటించారు.