దట్టమైన అడవి మధ్యలో సరస్సు, అందులో పడవ ప్రయాణం, అడవి మధ్యలో అటూ ఇటూ తిరుగాడే ఏనుగులు, నీటి కోసం బయటకు వచ్చే పులులు, అడవి దున్నలు.. చెట్లపై దుముకుతూ, వేలాడుతూ అల్లరి చేసే నీలగిరి కోతులు, చింపాంజీలు, చిరుతలు.. కనువిందు చేసే రకరకాల, రంగు రంగుల పక్షులు... ఇవన్నీ వింటుంటే ఏదో సినిమాలో దృశ్యం కాబోలు అనుకునేరు సుమా..! అలాంటిదేమీ కాదు. తేక్కడి అటవీ ప్రాంతంలో గల పెరియార్ వన్యమృగ సంరక్షణా కేంద్రంలోని దృశ్యాలే ఇవి...