ఆద్యంతం థ్రిల్లింగ్‌నిచ్చే "శేషాచలం" ట్రెక్కింగ్...!!

FILE

మన శరీరంలోని సిరలు, ధమనుల్లాగా అంతుపట్టకుండా ఉంటాయి "శేషాచలం" దారులన్నీ...! చుట్టూ ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నట్లుగా ఉండే కొండలు, లోయలు, చెట్లుచేమలూ, లెక్కలేనన్ని వన్యప్రాణులు.. వీటన్నింటికీ ఆలంబనగా అక్కడక్కడా నీటి చలిమలు, సెలయేళ్ళు ఈ శేషాచలం అడవి సొంతం.

తూర్పు కనుమలలో భాగమయిన శేషాచలం వనసీమ నిజానికి తిరుమలకు ఆధ్యాత్మిక అంతరాత్మ అని చెప్పవచ్చు. పురాణాలలో కనిపించే శేషపాన్పునే మన పూర్వీకులు శేషాచలం కొండతో పోల్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, జిల్లాల మధ్యన విస్తరించి ఉన్నవే శేషాచలం కొండలు.

అబ్బురపరిచే పెద్దపులి చిత్రం..!
  మూడువేల సంవత్సరాల క్రితం ఆదిమ మానవుడు గీసిన పెద్దపులి చిత్రం ఈ దారిలోనే కనిపిస్తుంది. అలాగే బూచోళ్ళపేట దగ్గర ఓ రాతి గోడపై గీసిన పురాతన అడవి చిత్రకారుల సహజ వర్ణ చిత్రాలు మనల్ని అబ్బుర పరుస్తాయి. అందులోని ఏనుగు సవారీ, వేట, కత్తీ డాలు, పిట్టలు...      
ఎర్రచందనానికి ప్రసిద్ధిగాంచిన శేషాచలం కొండల్లోకి ట్రెక్కింగ్ వెళ్ళాలంటే ముందుగా... రేణిగుంట-కడప జాతీయ రహదారి మీదుగా కుక్కల దొడ్డి గ్రామంవద్ద ఉన్న "బాలపల్లె బంగ్లా క్యాంప్" నుంచి బయలుదేరాలి. 1920లో బ్రిటీష్‌వారు కట్టిన ఈ బంగ్లా అప్పట్లో ఎందరో బ్రిటీష్ అధికారులకు, కలెక్టర్లకు, సర్వేయర్లకు, వేటగాళ్లకు ఆతిథ్యం ఇచ్చింది. ప్రఖ్యాత వేటగాడు కెన్నెత్ అండర్సన్ మనుషులను తినే ఒక పెద్దపులిని చంపేందుకు ఇక్కడే ఉండి పథకం వేశాడట.

ఆ తరువాత రాష్ట్రంలోనే మొదటి జాతీయ పార్కు అయిన శ్రీవెంకటేశ్వరా జాతీయోద్యానవనం గుండా ప్రయాణం సాగించాలి. తిరుమల, దాని చుట్టూ ఉండే వనాలన్నీ శ్రీ వెంకటేశ్వరా అభయారణ్యం పరిధిలోకే వస్తాయి. ఎప్పుడో 140 సంవత్సరాల క్రితమే అంతరించిపోయిందని అందరూ అనుకుంటున్న బంగారు బల్లిని ఆ మధ్య శాస్త్రవేత్తలు ఈ అడవుల్లోనే కనుగొన్నారట.

Ganesh|
ప్రయాణం అలా సాగుతుండగా "ఇరుసులు" అనే తొలి మజిలీ చేరుకుంటాం. పచ్చిని కొండల నడుమ ఆకుదొన్నెను మరిపించే ఒక రమ్యమైన ప్రదేశమే ఇరుసులు. ఇక్కడి మడుగులోని నీరు అడుగుభాగం కూడా కనిపించేటంత స్వచ్ఛంగా ఉంటాయి. తరువాత ఈ ప్రాంతానికి దగ్గర్లోనే ఉన్న "చాకిరేవుబాన జలపాతం" దిశగా ప్రయాణం సాగించాలి.


దీనిపై మరింత చదవండి :