పచ్చని ప్రకృతి, చల్లటి వాతావరణంతో వేసవిలో ఆహ్లాదంగా గడిపేందుకు అనువైన చక్కటి ప్రదేశమే ఉదక మండలం. కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల సరిహద్దుల్లో కొలువైన ఈ శీతల ప్రదేశాన్నే... వాడుకభాషలో అందరూ ఊటీ అని సంబోధిస్తుంటారు. ఈ ఊటిలో చూడదగిన ప్రదేశాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బొటానికల్ గార్డెన్స్. దొడబెట్ట శ్రేణులలో 50 ఎకరాల విస్తీర్ణంలో పచ్చికతో విస్తరించిన బొటానికల్ గార్డెన్స్ సందర్శకులను విశేషంగా అలరిస్తుంది. వేల రకాల మొక్కలు, పుష్పాలతో కవ్వించే ఈ గార్డెన్స్‌లో ప్రతి సంవత్సరం మే నెలలో జరిగే ప్లవర్ షోను తప్పకుండా చూసి తీరాల్సిందే..!