కుషాణు సామ్రాజ్య చక్రవర్తి కనిష్కుడి కాలం నాటి కోట ఖిలా ముబారక్. ఖిలా ముబారక్ కోట పంజాబ్లోని బథిండాలో ఉంది. బథిండా చరిత్ర ఈనాటిది కాదని భారత పురావస్తు శాఖ నిపుణులు అంటున్నారు. ఆధునిక భారతదేశ చరిత్రలో బథిండాకు ప్రత్యేక స్థానం ఉంది. పంచ నదులు...