గుజరాత్ టూరిజంకు అమితాబ్.. బెంగాల్‌కు షారుక్

వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT|
మన రాష్ట్రంలోని పర్యాటక శాఖ పర్యాటకులను ఆకర్షించేందుకు ఎలాంటి ప్రణాళికలు చేస్తుందో కానీ గుజరాత్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు మాత్రం ఈ వేసవిలో సాధ్యమైనంత ఎక్కువమంది పర్యాటకులను ఆకర్షించాలని చూస్తోంది. ఇందులో భాగంగా తమ రాష్ట్రంలో ఉన్న పర్యాటక కేంద్రాల విశిష్టతను తెలియజెప్పేందుకు ప్రత్యేకంగా బ్రాండ్ అంబాసిడర్లను ఎంపిక చేసింది

సౌజన్యం : దిజిటిడిఎస్

ఈ విషయంలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అందరికంటే ముందున్నారు. అమితాబ్ బచ్చన్‌ను టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకుని అక్కడి దర్శనీయ స్థలాల ప్రాధాన్యతను వివరించే చిన్నచిన్న ప్రకటనలను తయారు చేసి జాతీయ ఛానళ్లలో ప్రసారం చేస్తున్నారు. బిగ్ బి అలా ప్రచారం చేయడం మొదలుపెట్టారో లేదో.. గుజరాత్ రాష్ట్రానికి పర్యాటకుల తాకిడి మొదలైందట. కాసుల వర్షం కురుస్తోందట.

దీనిని చూసిన బెంగాల్ దీదీ మమతా బెనర్జీ తమ రాష్ట్ర సందర్శనీయ ప్రాంతాల ప్రమోషన్‌కు, పర్యాటకులను ఆకర్షించేందుకు షారుక్ ఖాన్‌ను ఎంపిక చేశారట. షారుక్ ఖాన్ తనదైన స్టయిల్‌లో పర్యాటక ప్రాంతాల ప్రాముఖ్యతను వివరించేందుకు సిద్ధమైపోయారట .

సౌజన్యం : విలాగరిజమ్
ఇక దేశంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించేవారికోసం, భారత పర్యాటక శాఖ అమీర్ ఖాన్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేసింది. ఈ ప్రమోషన్‌లో భాగంగా అమీర్ అతిథి దేవోభవ అంటూ విదేశీ పర్యాటకులను స్వాగతం పలుకుతున్నాడు.


దీనిపై మరింత చదవండి :