గుర్రం ముఖం ఆకారంగా కనిపించే పర్వతాలు, కదంబి జలపాతం పరవళ్లు, దట్టమైన అడవుల కలబోతతో కూడుకున్నదే కుద్రేముఖ్ జాతీయ వనం. కర్ణాటక రాష్ట్రంలోని చిక్మంగళూరు జిల్లాలో నెలకొన్న ఈ పర్వత శ్రేణులు.. గుర్రం ముఖం ఆకారంతో ఉండటంవల్ల వాటికి కుద్రేముఖ్ అనే పేరు వచ్చింది. కన్నడ భాషలో కుద్రే అంటే గుర్రం, ముఖ్ అంటే ముఖం అని అర్థం.