చిలుక సరస్సుకు 9 లక్షల వలస పక్షులు

Birds
FileFILE
పక్షి ప్రేమికుల స్వర్గధామంగా పేరు గాంచిన చిలుక సరస్సుకు సుమారు 9 లక్షల పక్షులు వలస వచ్చినట్లు చిలుక సరస్సు అటవీ శాఖ విభాగపు అధికారి అభిమన్యు బహేరా వెల్లడించారు. వీటిలో 158 రకాల జాతుల పక్షులు ఉన్నట్లు ఆయన తెలిపారు.

భువనేశ్వర్‌లో బుధవారం విలేకరుల సమావేశంలో అభిమన్యు మాట్లాడుతూ ఈ ఏడాది సరస్సుకు వచ్చిన 9లక్షల వలస పక్షుల్లో 4,50,000 పక్షులు నలబానా దీవికి వెళ్లాయని వ్యాఖ్యానించారు. గత ఏడాది 8,40,000 పక్షులు ఈ సరస్సుకు వచ్చాయని వాటిలో 1,98,000 పక్షులు నలబానాకు వెళ్లాయని చెప్పారు.

భువనేశ్వర్ (ఏజెన్సీ)| Hanumantha Reddy| Last Modified బుధవారం, 9 జనవరి 2008 (12:49 IST)
ఈ సరస్సు వద్ద సుమారు వేయి చదరపు కిలోమీటర్ల స్థలంలో పక్షుల రక్షణ చర్యలు చేపట్టామన్నారు. గతంలో వలస పక్షులు తక్కువగా వచ్చేవని... వలస పక్షులు సేదతీరే ప్రాంతంలో కలుపు మొక్కలను ఏరి పారేయడంతో ఈ ఏడాది మరిన్ని పక్షులు ఇక్కడకు చేరాయని ఆయన వివరించారు.


దీనిపై మరింత చదవండి :