ఒకవైపు కారుమబ్బులు, అంతలో చల్లగా వీస్తూ శరీరాన్ని రాసుకుంటూ పోయే పిల్లగాలి, అక్కడే జుమ్మని నాదం చేస్తూ తిరిగే తుమ్మెదలు.. రకరకాల రంగులతో, సువాసనలు వెదజల్లుతూ నవ్వుతూ పలుకరించే పుష్పాలు, ఇంతలో మేమున్నామని గుర్తు చేస్తూ కురిసే వర్షపు చినుకులు, వర్షానికి తడిసిన భూమాత మట్టి సువాసన... ఇవన్నీ మనసును దోచేవే. వీటికి భాష లేకపోయినా, వాటి లక్షణాలను బట్టి తన్మయత్వం చెందని హృదయమనేది ఉండదు. ఇంతటి ప్రకృతి సౌందర్యాన్ని తనలో దాచుకున్న కొడైకెనాల్ అందచందాలను వర్ణించాలంటే మాటలు చాలవు...