ఒంటినిండా పచ్చరంగు చీర చుట్టుకుని, రారమ్మని కవ్వించే ప్రకృతి సౌందర్యం జవదు కొండల సొంతం. ప్రకృతి అందాలతో నిండి ఉండే ఈ కొండల సౌందర్యాన్ని తనివితీరా చూసి ఆస్వాదించాలంటే తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాకు వెళ్లి తీరాల్సిందే..! చుట్టూ ఎత్తైన కొండలు, జలజల పారే సెలయేర్లు, చూసేంతదూరం పచ్చదనంతో స్వాగతం చెప్పే జవదు కొండల అందం వర్ణించేందుకు సాధ్యం కాదు.