నవ దంపతులకు బెస్ట్ హనీమూన్ స్పాట్లలో చెప్పుకోదగ్గది పట్నీటాప్ హిల్ స్టేషన్. ప్రకృతి రమణీయతకు అద్దంపడుతూ, ఎన్నో ప్రత్యేకాంశాలను తనలో దాచుకున్న ఈ పర్యాటక ప్రాంతం... భారతదేశం సరిహద్దుల్లో ఉన్న జమ్మూ కాశ్మీర్లో నెలకొని ఉంది. పట్నీటాప్ హిల్ స్టేషన్కు ఎలా వెళ్లాలంటే... జమ్మూ దాకా విమానంలో ప్రయాణించవచ్చు. అదే రైలు ప్రయాణం అయితే... దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి జమ్మూ వరకు రైళ్లు ఉన్నాయి. జమ్మూనుంచి పట్నీటాప్కు వెళ్లాలంటే.. ట్యాక్సీలు, బస్సులు ఉంటాయి. ట్యాక్సీలకయితే, పదిహేను వందల నుంచి 18 వందల దాకా ప్రయాణ ఛార్జీలు ఉంటాయి. ట్యాక్సీ ప్రయాణం మూడు గంటలు కాగా, బస్సు ప్రయాణం ఐదు గంటల సమయం పడుతుంది.