నేను చెట్టును...!

Gulzar Ghouse|
నేను చెట్టును
ప్రతి ప్రాణికి
అవసరమైన ప్రాణవాయువును ఇస్తూ
ఇలా నిలబడి ఉన్నాను
నేను చెట్టును.

ప్రతి నిత్యం ఇతరుల సుఖాలను చూసే నేను
నా సుఖం కోసం ఏనాడూ ఆలోచించలేదు
అయినాకూడా నన్నే ఎందుకు హింసిస్తారు...?
నేను చెట్టును
నేను చేసిన తప్పేంటి?

ప్రతి ఒక్కరికి కావలసినంతమేర సుఖాన్ని ఇచ్చాను
కాని నా సుఖం గురించి ఎవ్వరూ ఆలోచించలేదు
నేను లేకపోతే ఈ ప్రాణికోటి లేదు
మరి ఆ విషయం మరచిపోయారో ఏమో...!
అయినాకూడా నేను అలసిపోకుండా అందరికి సుఖాన్నిస్తున్నాను
నేను చెట్టును
నేను చేసిన తప్పేంటి?

నానీడలో అందరూ సేదతీరేవారే
నా కొమ్మలకు తాళ్ళు కట్టి ఊయలలూగారు
ఆ తర్వాత నన్ను మరచిపోతారు
అవసరం తీరితే
నన్ను అడ్డంగా, నిలువునా నరుకుతారు
అప్పుడు నా సేవలు గుర్తుకు రావు
అందుకేనేమో ప్రజలు అంటుంటే విన్నాను
ఒడ్డు దాటకముందు...
ఓడ మల్లన్న, ఒడ్డు దాటిన తర్వాత
బోడి మల్లన్న !
నేను బోడి మల్లన్నతో సమానమా...!
నిజమేనేమో...!
నేను చెట్టును


దీనిపై మరింత చదవండి :