ప్రకృతి అందాలకే అందం అరకు సౌందర్యం

green
FileFILE
అరకులోయ విశాఖపట్నం నరగరానికి 112 కిలోమీటర్ల దూరంలో ఉంది. విశాఖపట్నంకు తూర్పుగా ఉన్న పర్వత పంక్తుల్లో దాదాపు 3200 అడుగుల ఎత్తులో అరకులోయ ఉంది. దారి పొడవునా దట్టమైన అడవులున్నాయి. పద్మాపురం వద్ద బొటానికల్ గార్డెన్స్ ఉన్నాయి. అలాగే మల్బరీ తోటలు ఇక్కడ ప్రత్యకంగా కనిపిస్తాయి.

అలాగే ఇక్కడున్న పెద్ద ఆకర్షణ ఎమిటంటే గిరిజన మ్యూజియం. వారి సాంప్రదాయాలు ఈ మ్యూజియం ద్వారా ఉట్టిపడుతాయి. అలాగే చాపరాయ్ వద్ద కనిపించే దృశ్యాలు జీవితాంతం తీపి గుర్తులుగా మిగిలిపోతాయి. ఇక్కడ ఉండే పిక్‌నిక్ స్పాట్ ముఖ్యమైందిగా చెప్పవచ్చు. ఇక్కడ గిరిజన జాతుల నృత్యాలు ఆక్టటుకుంటాయి.ఇక అరకు లోయకు వెళ్ళే దారిలోని బొర్రా గుహలు చాలా పురాతనమైనవి.

పుత్తా యర్రం రెడ్డి|
అందమే అందం..
  ప్రశాంత వాతావరణ, పచ్చని తోటలు, కళ్ళు చల్లబడే వాతావరణం జనాన్ని ఆకట్టుకుంటుంది. ఎత్తైన కొండలు, లోతైన లోయలు, సవ్వడి చేసే జలపాతాలు, బిరిబిరా పారే సెలయేళ్ళు.... ఇవి ఇక్కడ కనిపించే దృశ్యాలు. ప్రకృతి అందాలన్ని అరకు సిగలోనే ఉన్నాయా అనిపిస్తుంది.      
విశాఖపట్నం అనే మాట వినగానే అబ్బా..! ఒక్కమారు అరకు లోయకు వెళ్ళి వచ్చి ఉంటే ఎంత బాగుండేది. అనిపిస్తుంది... ఒక వేళ అరకు లోయ గురించి తెలియకపోతే అంత ఇబ్బంది లేదుగాని... అక్కడి అందాల గురించి తెలిసిన తరువాత అక్కడకు వెళ్ళకుండా ఉండడం సాధ్యం కాదేమోననిపిస్తుంది.

అంధ్రప్రదేశ్లోని పర్యాటక కేంద్రాలలో అరకులోయ ప్రముఖమైనదనడంలో సందేహం అక్కరలేదు. అరకుకు అంతటి ప్రాధాన్యత ఉంది. అరకు అందమే వేరు. ఒక్క రోజు అక్కడ గడిపినా వందేళ్ళు జ్ఞాపకం ఉండి పోతుంది. ఇది అరకు ప్రత్యేకత. మరి ఇంత అందమైన పర్వత ప్రాంతం ఎక్కడ ఉంది. ఎలా వెళ్లాలి అనే సందేహాలు మీకు కలుగుతున్నాయి కదూ...

మిలియన్ల సంవత్సరాల కిందట ఇక్కడ ఆదిమానవులు నివసించించినట్లు చరిత్ర చెపుతోంది. వీటిన 1807లో కనుగొన్నారు. ఈ గుహలు సహజసిద్ధమైనవి. చుట్టు పర్వతాలు, లోయలు ఉండే ఈ గుహలను గిరిజనులు కనుగొన్నారని చెపుతారు. ఈ సహజ సిద్ధమైన గుహలు ప్రస్తుతం పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. గోస్తని నది ప్రవాహం వలన ఈ గుహలు ఏర్పడినట్లు పరిశోధకులు చెపుతున్నారు.


దీనిపై మరింత చదవండి :