అంటార్కిటికా, ఉత్తర అమెరికా, చైనా, సైబీరియా, నైజీరియాల్లాంటి సుదూర ప్రాంతాల నుంచి మే-అక్టోబర్ మాసాల మధ్య అతిథులుగా విచ్చేసే విగంహాలకు కొలువైన ప్రాంతమే రంగనతిట్టు పక్షి విహార కేంద్రం. మాండ్య జిల్లాలోని కావేరీ నదీ మధ్యభాగంలో, 57 హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ కేంద్రం శ్రీరంగపట్నానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ రకరకాల అందమైన పక్షులు చేసే అల్లరి ఓ పండుగ వాతావరణాన్ని తలపిస్తుంది. కొంగల బారులతో, పేర్లు తెలియని పక్షుల సందడితో ఆ ప్రదేశం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.